ఆదాయమార్గాల పెంపుపై సర్కారు దృష్టి

ఆదాయ మార్గాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం తొలిసారిగా వాణిజ్యపన్నుల శాఖలో పన్నుల రాబడిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పన్ను రాబడిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు సభ్యులుగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది వాణిజ్యపన్నుల రాబడి లక్ష్యాన్ని రూ.36,900 కోట్ల్లు నిర్దేశించగా, కొన్ని […]

Advertisement
Update:2015-08-02 18:40 IST
ఆదాయ మార్గాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం తొలిసారిగా వాణిజ్యపన్నుల శాఖలో పన్నుల రాబడిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పన్ను రాబడిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు సభ్యులుగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది వాణిజ్యపన్నుల రాబడి లక్ష్యాన్ని రూ.36,900 కోట్ల్లు నిర్దేశించగా, కొన్ని నెలలుగా అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల రాబడి పెరిగింది. గతేడాది ప్రతి నెలా సగటున రూ.2,300 కోట్ల నుంచి రూ.2,400 కోట్ల పన్నులు వసూలు కాగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతినెలా రూ.2,600 నుంచి రూ.2,700కోట్లు వసూలవుతున్నాయి. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 80 నుంచి 90శాతంగా ఉంది. వంద శాతం లక్ష్యం సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Tags:    
Advertisement

Similar News