రాజీనామా చేశాకే సభ: సోనియా పిలుపు

కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రాజీనామా చేసే వరకు సభను సాగనివ్వవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత మాత్రాన అడ్డగోలుగా వ్యవహరించడానికి లైసెన్సు ఉన్నట్టు కాదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. లలిత్ మోదీ వ్యవహారం, వ్యాపం కుంభకోణం నిందితులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. మనసులో మాట రేడియోలో చెప్పే ప్రధాని […]

Advertisement
Update:2015-08-03 09:32 IST
కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రాజీనామా చేసే వరకు సభను సాగనివ్వవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత మాత్రాన అడ్డగోలుగా వ్యవహరించడానికి లైసెన్సు ఉన్నట్టు కాదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. లలిత్ మోదీ వ్యవహారం, వ్యాపం కుంభకోణం నిందితులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. మనసులో మాట రేడియోలో చెప్పే ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మౌనవ్రతం పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. సహచరుల అవినీతిపై ఎందుకు నోరు మెదపడం లేదని సోనియా ప్రశ్నించారు. ప్రభుత్వం అడ్డగోలుగా, నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు.
విపక్షాలతో వెంకయ్య మంతనాలు
అంతకుముందు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూసేందుకు కేంద్రం ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అధికారపార్టీ తరఫు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ హాజరవగా, ఇతర పార్టీల నుంచి రామ్ గోపాల్ యాదవ్, శరద్ యాదవ్, శరద్ పవార్, మల్లిఖార్జున ఖర్గే, రామ్ విలాస్ పాశ్వాన్, గులాం నబీ ఆజాద్, మిశ్రా తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను అధికారం పక్షం కోరింది. సభలో ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని, సభను స్థంభింపజేసి సభా సమయాన్ని వృథా చేయడం సరికాదన్నారు. అయితే విపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ మంత్రులు రాజీనామా చేసేదాకా సభను సాగనీయమని స్పష్టం చేశాయి. దీంతో పరిస్థితి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
తొలిసారి స్పందించిన సుష్మా
లలిత్‌మోదీ వ్యవహారంపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తొలిసారి స్పందించారు. నేను ఎవరికీ ఎలాంటి సిఫారసులు చేయలేదని ఆమె చెప్పారు. లలిత్‌మోదీ కోసం బ్రిటన్‌ ప్రభుత్వంతో మాట్లాడలేదని ఆమె చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని సుష్మా కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆమె అన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధమా అంటూ సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు.
Tags:    
Advertisement

Similar News