టీడీపీ దోస్తీపై బీజేపీ అంతర్మథనం..కటీఫ్ అందామా ?
తెలుగుదేశం పార్టీతో దోస్తీకి ఎపుడెపుడు కటీఫ్ చెబుదామా అని బీజేపీ చూస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ ల మధ్య రోజురోజుకూ దూరం పెరిగిపోతున్నది. చంద్రబాబు ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యకర్తలకు కూడా గుర్తింపు లేదని ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలలో తెలుగుదేశంతో దోస్తీ అంశంపై ప్రధానంగా చర్చకు […]
Advertisement
తెలుగుదేశం పార్టీతో దోస్తీకి ఎపుడెపుడు కటీఫ్ చెబుదామా అని బీజేపీ చూస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ ల మధ్య రోజురోజుకూ దూరం పెరిగిపోతున్నది. చంద్రబాబు ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యకర్తలకు కూడా గుర్తింపు లేదని ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలలో తెలుగుదేశంతో దోస్తీ అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. కేంద్రం నుంచి పరిశీలకుడిగా వచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దార్థనాథ్ సింగ్ ఎదుట బీజేపీ నేతలు ఆవేదన వెళ్లగక్కినట్లు సమాచారం. కేంద్రంలో మనం టీడీపీకి తగిన గుర్తింపు, గౌరవం ఇస్తున్నా రాష్ట్రంలో తమకు ఎలాంటి గౌరవం దక్కడం లేదని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల పంపకంలో కూడా బీజేపీని అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసినట్లు పార్టీవర్గాలు ధృవీకరించాయి. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నామని, మళ్లీ అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదముందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, తెగతెంపులు చేసుకుని స్వంతంగా బలాన్ని పెంచుకోవడానికి పరిస్థితులు అనువుగా ఉన్నాయని రాష్ట్ర నాయకులు కేంద్ర పరిశీలకునికి వివరించినట్లు తెలుస్తోంది. 2019 నాటికి ఒంటరిగా బరిలో నిలబడే పరిస్థితికి చేరుకోవాలంటే ఇప్పుడే మనదారి మనం చూసుకోవడం ఉత్తమమని వారు పేర్కొన్నారని సమాచారం. దీనిపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందో చూడాలి.
Advertisement