అసైన్డ్‌ భూములకు పరిహారం ఎగ్గొట్టే యత్నం

రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో 21 వేల ఎకరాల్లో అసైన్డ్‌భూములున్నాయని, వాటికి పరిహారం ఇచ్చే విషయం ఇంతవరకు తేల్చలేదని సిపిఎం సీఆర్‌డీఏ ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌. బాబూరావు తెలిపారు. పరిహారం ఇచ్చే వరకు భూముల నుంచి వైదొలగే ప్రసక్తే లేదని, అందుకే తుళ్లూరు రెవెన్యూ పరిధిలో సుమారు 120 ఎకరాల్లో రెండు ట్రాక్టర్లతో రైతులు దుక్కి దున్నడం మొదలెట్టారని ఆయన అన్నారు. పైగా పొలాలున్నాయని పెన్షన్‌ ఇవ్వడం లేదని, ల్యాండ్‌ పూలింగు ప్రక్రియ మొదలు పెట్టిన సమయంలో […]

Advertisement
Update:2015-08-02 18:44 IST
రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో 21 వేల ఎకరాల్లో అసైన్డ్‌భూములున్నాయని, వాటికి పరిహారం ఇచ్చే విషయం ఇంతవరకు తేల్చలేదని సిపిఎం సీఆర్‌డీఏ ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌. బాబూరావు తెలిపారు. పరిహారం ఇచ్చే వరకు భూముల నుంచి వైదొలగే ప్రసక్తే లేదని, అందుకే తుళ్లూరు రెవెన్యూ పరిధిలో సుమారు 120 ఎకరాల్లో రెండు ట్రాక్టర్లతో రైతులు దుక్కి దున్నడం మొదలెట్టారని ఆయన అన్నారు. పైగా పొలాలున్నాయని పెన్షన్‌ ఇవ్వడం లేదని, ల్యాండ్‌ పూలింగు ప్రక్రియ మొదలు పెట్టిన సమయంలో అన్ని రకాల భూములకూ పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాత్సారం చేస్తోందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములపై అసైన్డ్‌ భూములు కాబట్టి రైతులకు హక్కులుండవని ప్రభుత్వం వాదిస్తోందని, పరిస్థితిని బట్టి చూస్తే పరిహారం ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News