హే (ఆశా)రామ్‌....మ‌హాత్మా మ‌న్నించు!

బాపు పేరున్న వాళ్లంతా మ‌హాత్ముల‌వుతారా? పేరు చివ‌ర‌న బాపు ఉన్నంత మాత్రాన మ‌హాత్ముల చెంత స్థాన‌మిస్తారా? ఇదేమి పైత్యం అని విద్యావేత్త‌లు మండిప‌డుతున్నారు . న‌వ్విపోదురు గాక నాకేల సిగ్గు అని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అత్యాచార కేసులో నిందితుడైన ఆశారాం బాపు చిత్రాన్ని పాఠ్య‌పుస్త‌కంలో మ‌హాత్ముల చెంత‌నే ముద్రించింది.  విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా  రాజ‌స్థాన్ స‌ర్కారు స్పందించ‌లేదు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాం బాపు  ఫొటోను శంకరాచార్య, మదర్‌థెరెసా, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గురునానక్‌, సంత్‌కబీర్‌ల చిత్రాల ప‌క్క‌నే […]

Advertisement
Update:2015-08-03 07:23 IST
బాపు పేరున్న వాళ్లంతా మ‌హాత్ముల‌వుతారా? పేరు చివ‌ర‌న బాపు ఉన్నంత మాత్రాన మ‌హాత్ముల చెంత స్థాన‌మిస్తారా? ఇదేమి పైత్యం అని విద్యావేత్త‌లు మండిప‌డుతున్నారు . న‌వ్విపోదురు గాక నాకేల సిగ్గు అని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అత్యాచార కేసులో నిందితుడైన ఆశారాం బాపు చిత్రాన్ని పాఠ్య‌పుస్త‌కంలో మ‌హాత్ముల చెంత‌నే ముద్రించింది. విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా రాజ‌స్థాన్ స‌ర్కారు స్పందించ‌లేదు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాం బాపు ఫొటోను శంకరాచార్య, మదర్‌థెరెసా, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గురునానక్‌, సంత్‌కబీర్‌ల చిత్రాల ప‌క్క‌నే ముద్రించారు. బాలిక‌ను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన ఆశారాం బాపును మహాత్ముడిగా అభివర్ణిస్తూ, ఆయన చిత్ర పటాన్ని గుర్తించాల్సిందిగా మూడో తరగతి జీకే పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశంపై అన్నివ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
విద్యాశాఖ‌కు తెలియ‌దు.. ప‌బ్లిష‌ర్‌కు బాధ్య‌త‌లేదు
ఆశారాం బాపు పాఠ్యాంశం 3వ త‌ర‌గ‌తి పుస్త‌కాల్లో ఉంద‌ని త‌మ‌కు తెలియద‌ని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 'ఆశారాంను పాఠ్యాంశంలో చేర్చే నాటికి ఆయనపై ఎలాంటి కేసులో లేవు. పుస్తకం అచ్చయి విద్యార్థులకు చేరిన తరువాత ఆయన అరెస్టయ్యారు. వెంటనే ఆ పుస్తకాలన్నీ వెనక్కి తెప్పించాం. కొత్తవాటిని ముద్రించే పనిలో ఉన్నాం’ అని పబ్లిషర్ వివ‌ర‌ణ ఇచ్చారు.
2013లో జైలుకెళితే 2015 సిల‌బ‌స్‌లోకి ఎలా వ‌చ్చాడు?
విద్యాశాఖ త‌మ‌కు తెలియ‌ద‌ని త‌ప్పించుకుంటే.. త‌న త‌ప్పేం లేద‌ని ప‌బ్లిష‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ఇది పూర్తిగా నిర్ల‌క్ష్యంతో కావాల‌నే చేశార‌ని విద్యావేత్త‌లు ఆరోపిస్తున్నారు. 2013 సంవత్సరం ఆగస్టులోనే ఆశారాం బాపు అత్యాచారం కేసులో జైలుకు వెళ్లారు. ఇంకా ఆయ‌న జైలులోనే ఉన్నారు. ఈ సంగ‌తి తెలిసి కూడా 2015 పాఠ్య‌పుస్త‌కాల్లో ఆశారాం మ‌హాత్ముల స‌ర‌స‌న స్థానం ఎలా సంపాదించాడ‌ని విద్యావేత్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News