సీపీఎం-వైసీపీ మధ్య పెరుగుతున్నస్నేహం!
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య స్నేహం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరు పార్టీల నాయకుల మధ్య కిందిస్థాయిలో పెరుగుతున్న సంబంధాలే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదాపై రెండు పార్టీలదీ ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా కొనసాగుతున్నారు. 10వ తేదీన ఢిల్లీలో జరగనున్న జగన్ ప్రత్యేక హోదా దీక్షకు సీపీఎం నాయకులను రప్పించి సంఘీభావం తెలిపేలా చూస్తే జాతీయ స్థాయిలో ప్రచారం దక్కుతుందని వైసీపీ నాయకులు ఆలోచిస్తున్నారు. కాగా దిగువ […]
Advertisement
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య స్నేహం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరు పార్టీల నాయకుల మధ్య కిందిస్థాయిలో పెరుగుతున్న సంబంధాలే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదాపై రెండు పార్టీలదీ ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా కొనసాగుతున్నారు. 10వ తేదీన ఢిల్లీలో జరగనున్న జగన్ ప్రత్యేక హోదా దీక్షకు సీపీఎం నాయకులను రప్పించి సంఘీభావం తెలిపేలా చూస్తే జాతీయ స్థాయిలో ప్రచారం దక్కుతుందని వైసీపీ నాయకులు ఆలోచిస్తున్నారు. కాగా దిగువ స్థాయిలో కూడా ఈ రెండు పార్టీల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి. రాజధాని భూసేకరణ వ్యతిరేక కార్యకలాపాల్లో ఈ రెండు పార్టీల నాయకులు చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా నంద్యాలలో సీపీఎం చేపట్టిన దీక్షకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలపడం సంచలనంగా మారింది. నంద్యాల పట్టణ అభివృద్ధికి గాను తక్షణమే రు.350 కోట్లను కేటాయించాలని కోరుతూ సీపీఎం నాయకులు నంద్యాల పట్టణంలో 72 గంటల నిరసన దీక్షకు దిగారు. ఆ దీక్షకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మద్దతునిచ్చారు. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్లు, కూల్‌డ్రింక్స్ పరిశ్రమలను తెరిపించాలని సీపీఎం నాయకులు కోరుతున్నారు. కాగా ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తే ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు పోయి తమ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతోందని ఆరోపించారు.
Advertisement