అమరావతి నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాజధాని నిర్మాణ సలహ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆదివారం ఏపీ సచివాలయంలో మంత్రి నారాయణ అధ్యక్షతన రాజధాని సలహా కమిటీ భేటీ జరిగింది. సింగపూర్ ప్రభుత్వం నుంచి సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందిన తరువాత తొలిసారిగా కమిటీ సమావేశమైంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వీలైనంత త్వరగా లే-అవుట్లు వేసి అభివృద్ధి పరిచి ప్లాట్లు ఇవ్వాలని కమిటీ […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాజధాని నిర్మాణ సలహ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆదివారం ఏపీ సచివాలయంలో మంత్రి నారాయణ అధ్యక్షతన రాజధాని సలహా కమిటీ భేటీ జరిగింది. సింగపూర్ ప్రభుత్వం నుంచి సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందిన తరువాత తొలిసారిగా కమిటీ సమావేశమైంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వీలైనంత త్వరగా లే-అవుట్లు వేసి అభివృద్ధి పరిచి ప్లాట్లు ఇవ్వాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించి నిర్మాణంలో పురోగతి సాధించాలని సభ్యులు నిర్ణయించారు. ఇప్పటివరకు రైతులు 34 వేల ఎకరాలు అందజేశారని, వారికి త్వరితగతిన వారికొచ్చే వాటా భూమి అందజేయాలని సూచించింది. దీనివల్ల రైతుల్లో నమ్మకం ఏర్పడుతుందని కమిటీ స్సష్టం చేసింది. అనంతరం పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధిపతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. వీలైనంత త్వరలో ఆయా విభాగాల కార్యాలయాలను రాష్ట్ర నూతన రాజధాని పరిధిలో ఏర్పాటు చేయాలని మంత్రి, అధికారులను ఆదేశించారు.
Advertisement