27 మంది ఎంపీలు 5 రోజులపాటు సస్పెన్షన్
అధికార పక్షం సభ్యులు ఎక్కువగా ఉన్న లోక్‌సభలోను, విపక్షం సభ్యులు అధికంగా ఉన్న రాజ్యసభలోను ఒకటే గందరగోళం… పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచీ మారని తీరు… చివరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సహనం కోల్పోయారు. ఒకేసారి 27 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల నుంచి ఒకటే గందరగోళం మధ్య నడుస్తున్న ఉభయ సభలు కూడా సోమవారం అట్టుడికాయి. అవినీతి, అక్రమ నిర్ణయాల ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి […]
Advertisement
అధికార పక్షం సభ్యులు ఎక్కువగా ఉన్న లోక్‌సభలోను, విపక్షం సభ్యులు అధికంగా ఉన్న రాజ్యసభలోను ఒకటే గందరగోళం… పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచీ మారని తీరు… చివరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సహనం కోల్పోయారు. ఒకేసారి 27 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల నుంచి ఒకటే గందరగోళం మధ్య నడుస్తున్న ఉభయ సభలు కూడా సోమవారం అట్టుడికాయి. అవినీతి, అక్రమ నిర్ణయాల ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధరరాజే, శివరాజ్‌సింఘ్ చౌహాన్‌లు రాజీనామా చేసి తీరాల్సిందేనని పార్లమెంటు తొలిరోజు నుంచీ విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ప్రతి రోజూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నాయి. సోమవారం కూడా తీరు మారలేదు. రెండుసార్లు లోక్‌సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయినా అదే పరిస్థితి. విపక్ష ఎంపీల స్పీకర్ పొడియంను చుట్టిముట్టి ప్లకార్డులతో ఆందోళనకు దిగుతూ నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను సజావుగా జరగనివ్వాలని, సభ్యులంతా సహకరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ చర్యలకు ఉపక్రమించి 377 నిబంధన ప్రకారం 27 మంది ఎంపీలను ఐదు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా సభ తీరు సజావుగా లేకపోవడంతో డిప్యూటి ఛైర్మన్ కురియన్ పలుసార్లు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన ప్రతిసారీ అవే నిరసనలు… అదే పరిస్థితి. దీంతో ఆయన కూడా సభను మంగళవారానికి వాయిదా వేసి వెళ్ళిపోయారు.
Advertisement