మూడో శక్తిగా వామపక్షాలు
ఎన్డీఏ, యూపీఏ కూటములకు వ్యతిరేకంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు వామపక్ష శక్తులు ఏకమవ్వాలని ప్రత్యామ్నాయ మూడో శక్తికి ఎదగాలని సీపీఏం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్ పిలుపునిచ్చారు. సామాన్యులకు అండగా తృతీయ రాజకీయ శక్తి అవసరమని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన ప్రజాస్వామ్యం-కార్పోరేట్ రాజకీయాలు సదస్సులో ఆయన ప్రసంగించారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ అవినీతిలో కూరుకు పోయిందని, సబ్సిడీలు ఎత్తివేసి పేదప్రజలను మోసం చేస్తోందని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా జాప్యం చేస్తోందని […]
Advertisement
ఎన్డీఏ, యూపీఏ కూటములకు వ్యతిరేకంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు వామపక్ష శక్తులు ఏకమవ్వాలని ప్రత్యామ్నాయ మూడో శక్తికి ఎదగాలని సీపీఏం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్ పిలుపునిచ్చారు. సామాన్యులకు అండగా తృతీయ రాజకీయ శక్తి అవసరమని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన ప్రజాస్వామ్యం-కార్పోరేట్ రాజకీయాలు సదస్సులో ఆయన ప్రసంగించారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ అవినీతిలో కూరుకు పోయిందని, సబ్సిడీలు ఎత్తివేసి పేదప్రజలను మోసం చేస్తోందని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపేనిచ్చారు.
Advertisement