ప్రైవేటు స్కూళ్ళ దోపిడీపై ఆరని 'మంటలు'

ఉద్య‌మం ఉద్రిక్త‌త‌కు కార‌ణ‌మైంది. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపీడీపై ఆగ్ర‌హజ్వాల‌లు ఎగిసిప‌డ్డాయి. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ విడుద‌ల చేయాల‌ని, ప్రైవేట్ స్కూళ్ల‌లో ఫీజులు నియంత్రించాల‌ని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం చేప‌ట్టిన ఉద్య‌మంలో నిర‌స‌న మంట‌లు చెల‌రేగాయి. బీసీ రాష్ర్ట సంఘం పిలుపు మేర‌కు  శ‌నివారం మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ప్రైవేట్ స్కూళ్ల‌లో సాగుతున్న ఫీజుల దందాపై బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.సిరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. […]

Advertisement
Update:2015-08-02 16:04 IST
ఉద్య‌మం ఉద్రిక్త‌త‌కు కార‌ణ‌మైంది. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపీడీపై ఆగ్ర‌హజ్వాల‌లు ఎగిసిప‌డ్డాయి. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ విడుద‌ల చేయాల‌ని, ప్రైవేట్ స్కూళ్ల‌లో ఫీజులు నియంత్రించాల‌ని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం చేప‌ట్టిన ఉద్య‌మంలో నిర‌స‌న మంట‌లు చెల‌రేగాయి. బీసీ రాష్ర్ట సంఘం పిలుపు మేర‌కు శ‌నివారం మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ప్రైవేట్ స్కూళ్ల‌లో సాగుతున్న ఫీజుల దందాపై బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.సిరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఇదే స‌మ‌యంలో సిరిబాబు వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స‌హ విద్యార్థులు మంట‌ల‌ను ఆర్పి స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 30 శాతం కాలిన గాయాలైన సిరిబాబును హైద‌రాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ‘‘అధిక ఫీజులతో ప్రైవేట్‌ పాఠశాలలు పేద విద్యార్థులను దోచుకొంటున్నాయి. ఈ ధోరణిని అరికట్టాలని ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్‌, డీఈవోలకు విజ్ఞప్తి చేశాం. అయినా ఫలితం లేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకొంటున్నాను’’ అని సిరిబాబు రాసినట్టు చెబుతున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
సిరిబాబు వ్య‌వ‌హారం అంతా సీక్రెట్‌
సిరిబాబు ఆత్మాహ‌త్యాయ‌త్నం క‌ల‌క‌లం రేపింది. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌తిప‌క్షాలు కూడా నోరు విప్ప‌లేదు. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా ఈ ఇష్యూని సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ బీసీ సంఘం నేత‌లు మాత్రం సిరిబాబు వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం పాత్ర ఉంద‌ని చెబుతోంది. సిరిబాబుకు ఏమైనా జ‌రిగితే తెలంగాణ ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అంటున్నారు. హైద‌రాబాద్ య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సిరిబాబును గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని, అక్క‌డ్నించి ఎక్క‌డికి త‌ర‌లించారో కూడా తెలియ‌డంలేద‌ని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు బీరయ్య యాదవ్ ఆరోపిస్తున్నారు. సిరిబాబుకు ఏం జరిగినా సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుదే బాధ్యత అని హెచ్చ‌రించారు.
Tags:    
Advertisement

Similar News