ఉమ్మడి మద్యం బకాయిలను చెల్లించండి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం వ్యాపారంపై సర్వీస్ ట్యాక్స్ బకాయిలను చెల్లించాల్సిందిగా కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగం తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. 2010-11 నుంచి 2013-14 వరకు జరిగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, బాట్లింగ్ వంటి సేవలకు కేంద్రానికి రూ. 1000 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ పన్ను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర విభజన కారణంగా ఈ పన్నుకు సంబంధించిన పూర్తి వివరాలు, చెల్లింపులకు సంబంధించి గతంలో జరిగిన లావాదేవీలను అందచేయాలని […]
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం వ్యాపారంపై సర్వీస్ ట్యాక్స్ బకాయిలను చెల్లించాల్సిందిగా కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగం తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. 2010-11 నుంచి 2013-14 వరకు జరిగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, బాట్లింగ్ వంటి సేవలకు కేంద్రానికి రూ. 1000 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ పన్ను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర విభజన కారణంగా ఈ పన్నుకు సంబంధించిన పూర్తి వివరాలు, చెల్లింపులకు సంబంధించి గతంలో జరిగిన లావాదేవీలను అందచేయాలని కస్టమ్స్ హైదరాబాద్ శాఖ తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్‌కు నోటీసులు పంపింది.
Advertisement