కోలాతో `కొవ్వు`కేక
ఊబకాయం తగ్గించుకోవడానికి తీసుకునే డైట్‌తో మరింత ఊబిలోకి దిగడం ఖాయం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కోలా వంటి డైట్ డ్రింక్స్ తీసుకుంటే గంటలోనే వెయిట్ గెయిన్ అవుతుందని, స్థూలకాయులకు ఇది డేంజర్‌బెల్స్ మోగించే డ్రింక్ అని పరిశోధకులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ఉద్దేశించిన ఫుడ్డు తిని మరింత లావెక్కి బెడ్డు ఎక్కడం ఖాయం అంటున్నారు. స్థూలకాయం తగ్గించుకోవడానికి డాక్టర్ల సూచనమేరకు కొందరు కొవ్వు చాలా తక్కువగా డైట్ కోక్, జంక్‌ఫుడ్ తీసుకుంటుంటారు. అయితే ఈ రకమైన ఫుడ్ […]
Advertisement
ఊబకాయం తగ్గించుకోవడానికి తీసుకునే డైట్‌తో మరింత ఊబిలోకి దిగడం ఖాయం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కోలా వంటి డైట్ డ్రింక్స్ తీసుకుంటే గంటలోనే వెయిట్ గెయిన్ అవుతుందని, స్థూలకాయులకు ఇది డేంజర్‌బెల్స్ మోగించే డ్రింక్ అని పరిశోధకులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ఉద్దేశించిన ఫుడ్డు తిని మరింత లావెక్కి బెడ్డు ఎక్కడం ఖాయం అంటున్నారు. స్థూలకాయం తగ్గించుకోవడానికి డాక్టర్ల సూచనమేరకు కొందరు కొవ్వు చాలా తక్కువగా డైట్ కోక్, జంక్‌ఫుడ్ తీసుకుంటుంటారు. అయితే ఈ రకమైన ఫుడ్ తీసుకోవడంతో మరింత స్థూలకాయులుగా మారుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైందని ద రెనెగేడ్ ఫార్మసిస్ట్ డాట్ కాం వెల్లడించింది.
స్థూలకాయం సమస్యల భయంతోనే..
స్థూలకాయం వల్ల హార్ట్ డిసీజెస్, డయాబెటిక్ వస్తాయనే భయంతో వైద్యుల సలహా మేరకు కొందరు కొవ్వు తక్కువగా ఉన్న ప్రత్యామ్నాయ ఆహారాన్ని ఎంచుకుంటారు. వీటిలో రెడీమేడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఉంటున్నాయి. వాటిలో ఫ్రక్టోజ్‌ను రుచి కోసం హైఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ రూపంలో కంపెనీలు కలిపేస్తున్నాయి. ఇదే వినియోగదారులపాలిట శాపంగా మారుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో అధిక భాగం ఉండే గ్లూకోజ్ మన జీవన చర్యలకు అవసరమైన ఇంధనంలాంటిది. అది శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది. కానీ,ఫ్రక్టోజ్ అలా కాదు. ఫ్రుక్టోజ్ అనేది సుక్రోజ్‌లో ఉంటుంది. అది గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా విడిపోతుంది. అది మన కాలేయం ద్వారా శరీరానికి చేరుతుంది. ఇది శరీరానికి సరిపోతుందా? అనే సంకేతాలు ఇవ్వకపోవడం వల్ల ఆకలిగా ఉండి అధిక ఆహారం తీసుకుంటాం. ఇదే స్థూలకాయుల్ని మరింత స్థూలకాయులిగా మార్చేస్తోందని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్రక్టోజ్‌ను అతిగా తీసుకునేవాళ్లలో ఎక్కువభాగం కోకాకోలావంటి కూల్‌డ్రింక్స్ వినియోగదారులే ఉన్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
ఆరోగ్యకర ఆహారం
స్థూలకాయం పెంచే డైట్ డ్రింక్స్, సాఫ్ట్..ఫాస్ట్ ఫుడ్స్ కు ప్రత్యామ్నాయంగా తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారంతోపాటు గ్రీన్ టీ, నిమ్మరసం తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. పండ్లలో ఫ్రక్టోజ్ ఉన్నా..అందులో సహజసిద్ధంగా ఉండే పీచు వల్ల శరీరం ఫ్రక్టోజ్‌ను తక్కువగానే గ్రహిస్తుంది. దీనివల్ల స్థూలకాయం సమస్య రాదని వైద్యులు చెబుతున్నారు.
కోలా హలం
కోకోకోలా డ్రింక్స్ తీసుకునేవారిలో అధికంగా ప్రక్టోజ్ ఉంటుందని అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల కోక్ డ్రింక్స్ అమ్ముడవుతున్నాయి. ఈ డైట్ డ్రింక్స్ మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోకాకోలా వంటి కెఫినేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే మొదటి పది నిమిషాల్లో..పది టీ స్పూన్ల షుగర్ జీర్ణవ్యవస్థలోకి వెళ్తుంది. 20 నిమిషాల్లో… రక్తంలో షుగర్ అధికమవుతుంది. ఇన్స్‌లిన్ పేలిపోతుంది. దాంతో,కాలేయంలోని షుగర్ కొవ్వుగా మారటం అధికమవుతుంది. 40 నిమిషాల్లో.. డ్రింక్‌లోని కెఫీన్ రక్తంలో కలిసిపోతుంది. రక్తపోటు అధికమవుతుంది. దాంతో, కాలేయం మరింత షుగర్‌ను రక్త ప్రవాహంలోకి పంప్ చేస్తుంది. అలసటను నివారిస్తూ మెదడులోని అడినోసైన్ గ్రాహకం మూసుకుపోతుంది. 45 నిమిషాల్లో..శరీరంలో డొపామైన్ ఉత్పత్తి అధికమవుతుంది. మనసులోని ఆహ్లాద కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. 60 నిమిషాల్లో..పేగు కింది భాగంలోని క్యాల్షియం, మెగ్నీషియం,జింక్ ధాతువులను ఫాస్పారిక్ ఆమ్లం కప్పేస్తుంది. జీవన చర్యలు అధికమై ఎముకల్లో కలవాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ ధాతువులతో పాటు సోడియం కూడా మూత్రంలో బయటకెళ్తాయి. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలను అందించకుండానే కోక్ ద్వారా శరీరంలోకి వెళ్లిన నీరంతా బయటకు వెళ్తుంది.
కోక్ తో లెక్కలేనన్ని సమస్యలు
కోక్‌తోపాటు ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకునేవారిలో రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు, షుగర్, ఊబకాయంవంటి రుగ్మతలకు అవకాశముంటుందని ఇటీవల అమెరికాలో ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. కోక్ సోడా రెగ్యులర్‌గా తీసుకునేవారిలో దాదాపు సగంమందిలో(48 శాతం) ఈ సమస్యలు కనిపించాయి.
Advertisement