తమిళనాట ప్రతీ ఆగస్టు 15న కలాం అవార్డు
మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ దివంగత అబ్దుల్ కలాం పేరుతో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న అవార్డు ప్రదానం చేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలిత శుక్రవారం ప్రకటించారు. శాస్త్రీయ విజ్ఞానంలో ఉత్తమ ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు, విద్యార్ధుల ఉన్నతికి పాటుపడేవారు, మానవతావాదులకు అబ్దుల్ కలాం అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 8 గ్రాముల బంగారు పతకం, రూ. 5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందచేస్తారు. కలాం జయంతి రోజైన అక్టోబరు 15వ తేదీని […]
Advertisement
మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ దివంగత అబ్దుల్ కలాం పేరుతో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న అవార్డు ప్రదానం చేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలిత శుక్రవారం ప్రకటించారు. శాస్త్రీయ విజ్ఞానంలో ఉత్తమ ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు, విద్యార్ధుల ఉన్నతికి పాటుపడేవారు, మానవతావాదులకు అబ్దుల్ కలాం అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 8 గ్రాముల బంగారు పతకం, రూ. 5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందచేస్తారు. కలాం జయంతి రోజైన అక్టోబరు 15వ తేదీని యువ చైతన్య దినంగా పాటించనున్నట్లు ఆమె తెలిపారు. కలాంకు నివాళిగా నాలుగు పోస్టల్ స్టాంపులను రూపొందించినట్లు తపాలా శాఖ చెన్నై డైరెక్టర్ చెప్పారు.
Advertisement