తెలంగాణ, ఆంధ్రా రెండింటికి రాంజెఠ్మలానీనే!
రాంజెఠ్మలానీ.! ఆధునిక న్యాయవాదుల్లో భీష్ముడిగా, దేశంలో న్యాయకోవిదుడిగా పేరొందిన వ్యక్తి. ఇందిరాగాంధీని హత్య చేసిన వారి తరఫున దేశంలో ఏ న్యాయవాది వాదించడానికి వీలులేదంటూ..ఇండియన్ బార్ అసోషియేషన్ తీర్మానం చేసినా.. ఒక్కడు ముందుకు వచ్చాడు. ఆ ఒక్కడే రాంజెఠ్మలానీ, దేశమంతా ఈ వార్త విని అవాక్కయింది. అప్పుడు తెరమీదకి వచ్చిన ఈ పేరు నేటికీ వినబడుతూనే ఉంది. మహా మహా కరోడా కేసులన్నీ రాంజెఠ్మలానీ వద్దకు వెళ్లడం దేశంలో సంప్రదాయంగా మారింది. దావూద్ ఇబ్రహీంలాంటి మాఫియా డాన్ నుంచి […]
Advertisement
రాంజెఠ్మలానీ.! ఆధునిక న్యాయవాదుల్లో భీష్ముడిగా, దేశంలో న్యాయకోవిదుడిగా పేరొందిన వ్యక్తి. ఇందిరాగాంధీని హత్య చేసిన వారి తరఫున దేశంలో ఏ న్యాయవాది వాదించడానికి వీలులేదంటూ..ఇండియన్ బార్ అసోషియేషన్ తీర్మానం చేసినా.. ఒక్కడు ముందుకు వచ్చాడు. ఆ ఒక్కడే రాంజెఠ్మలానీ, దేశమంతా ఈ వార్త విని అవాక్కయింది. అప్పుడు తెరమీదకి వచ్చిన ఈ పేరు నేటికీ వినబడుతూనే ఉంది. మహా మహా కరోడా కేసులన్నీ రాంజెఠ్మలానీ వద్దకు వెళ్లడం దేశంలో సంప్రదాయంగా మారింది. దావూద్ ఇబ్రహీంలాంటి మాఫియా డాన్ నుంచి తమిళనాడు సీఎం జయలలిత దాకా పెద్ద కేసులన్నీ ఆయన వద్దకు వెళ్తున్నాయి. ఇందులో చాలామటుకు ఆయన నిందితుల తరఫునే వాదనలు వినిపించడం విశేషం. ఆయన కేసు చేపట్టారంటే.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఏ పాయింట్ లాగుతారో తెలియక అవతల లాయరుకు రాత్రుళ్లు నిద్ర ఉండదట… అంతటి ఘనుడు ఈ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ.
ఏది గెలుస్తారు?
ఓటుకు నోటుకుంభకోణం కేసులో ప్రధాననిందితుడు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తరఫున వాదనలు చేపట్టారు రాంజెఠ్మలానీ. అంటే పరోక్షంగా ఏపీప్రభుత్వాన్ని కాపాడేందుకు వాదిస్తున్నారు. తాజాగా అదే రాం జెఠ్మలానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసును వాదిస్తున్నారు. ఇదేంటి? దాదాపు రెండు కేసులు ఒకే అంశంతో ముడిపడి ఉన్నాయి కదా? అదేనా మీ అనుమానం? ఇక్కడ చిన్న మెలిక ఉంది. ఓటుకు నోటు కేసు తెలంగాణలో నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏపీలో నమోదైంది. రాజకీయంగా రెండూ ఒకే అంశానికి చెందినవి. సాంకేతికంగా మాత్రం రెండు వేర్వేరు. ఇదే పాయింట్‌ను రాంజెఠ్మలానీ గుర్తించారు. అందుకే రెండు కేసుల్లోనూ ఆయన తన వాదనలు వినిపిస్తున్నారు. ఒక కేసు పెట్టిన వారు మరో కేసులో నిందితులు కావడం ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది. రెండింటిలో ఆయన దేనిలో విజయం సాధిస్తారో? వేచి చూడాలి.
Advertisement