బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థే వీసీ!
ఒకప్పుడు అదే వర్సిటీలో విద్యనభ్యసించాడు. ఇప్పుడు అదే వర్సిటీకి వీసీ అయ్యాడు. ఇదీ తుళ్లూరు రైతుబిడ్డ వీఎస్ రావు ఘనత. బిట్స్ పిలానీ డీమ్డ్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్‌గా గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన వఝ్ఝా సాంబశివరావు ( వీఎస్ రావు) బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ లో రూ.250 కోట్లతో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సాంబశివరావు ..ప్రస్తుతం క్యాంపస్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇన్‌చార్జ్ వీసీగా నియమితులైన వీఎస్ రావు..350 కోట్ల […]
Advertisement
ఒకప్పుడు అదే వర్సిటీలో విద్యనభ్యసించాడు. ఇప్పుడు అదే వర్సిటీకి వీసీ అయ్యాడు. ఇదీ తుళ్లూరు రైతుబిడ్డ వీఎస్ రావు ఘనత. బిట్స్ పిలానీ డీమ్డ్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్‌గా గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన వఝ్ఝా సాంబశివరావు ( వీఎస్ రావు) బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ లో రూ.250 కోట్లతో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సాంబశివరావు ..ప్రస్తుతం క్యాంపస్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇన్‌చార్జ్ వీసీగా నియమితులైన వీఎస్ రావు..350 కోట్ల రూపాయలతో విస్తరిస్తున్న క్యాంపస్ పనులను పర్యవేక్షిస్తున్నారు. తుళ్లూరులోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన వీఎస్‌రావు గ్రామంలోనే ప్రాథమిక విద్యనభ్యసించారు. ఇంటర్ తరువాత బిట్స్ పిలానీలో బీఎస్సీ చేసి అక్కడే ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. బిట్స్ పిలానీలోనే అధ్యాపకునిగా చేరిన వీఎస్ రావు..అదే వర్సిటీకి వీసీ కావడం విశేషం.
Advertisement