తెలంగాణలో అక్టోబర్‌ నుంచి కొత్త ఎక్సైజ్‌ విధానం

తెలంగాణలో నూతన ఎక్సైజ్ విధానానికి టీసర్కార్ శ్రీకారం చుట్టింది. అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమలు కానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గుడుంబా వల్ల సంక్షేమ పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా నివారణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హాని కలిగించని మద్యాన్ని తక్కువ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాది చెరువుకట్టలపై 5 కోట్ల ఈత మొక్కలు నాటి క్రమంగా కల్తీ కల్లును అరికడతామన్నారు. రాష్ట్రంలో […]

Advertisement
Update:2015-07-31 18:41 IST
తెలంగాణలో నూతన ఎక్సైజ్ విధానానికి టీసర్కార్ శ్రీకారం చుట్టింది. అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమలు కానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గుడుంబా వల్ల సంక్షేమ పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా నివారణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హాని కలిగించని మద్యాన్ని తక్కువ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాది చెరువుకట్టలపై 5 కోట్ల ఈత మొక్కలు నాటి క్రమంగా కల్తీ కల్లును అరికడతామన్నారు. రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం అంతా ఇక్కడే తయారయ్యే విధంగా డిస్టలరీస్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
Tags:    
Advertisement

Similar News