చార్మినార్‌ను కూల్చేస్తాం: డిప్యూటీ సీఎం
అవసరమని భావిస్తే ప్రభుత్వం చార్మినార్‌ను కూల్చడానికి కూడా వెనుకాడదని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ మాటలు అన్ని వర్గాల్లో సంచలనం రేపాయి. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడంలో తప్పేమీ లేదన్న ఆయన శిథిలావస్థకు చేరితే చార్మినార్‌నైనా కూల్చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. పాత కట్టడాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడంలో ఏ మాత్రం తప్పు లేదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఉస్మానియా ఆస్పత్రి […]
అవసరమని భావిస్తే ప్రభుత్వం చార్మినార్‌ను కూల్చడానికి కూడా వెనుకాడదని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ మాటలు అన్ని వర్గాల్లో సంచలనం రేపాయి. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడంలో తప్పేమీ లేదన్న ఆయన శిథిలావస్థకు చేరితే చార్మినార్‌నైనా కూల్చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. పాత కట్టడాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడంలో ఏ మాత్రం తప్పు లేదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో 10 అంతస్థుల ప్రపంచ స్థాయి ఆస్పత్రి నిర్మాణం చేపడతామని చెప్పారు. అయితే ఉస్మానియా ఆస్పత్రి పేరును మార్చడం లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు మహమూద్ అలీ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ, తెలంగాణకు చెందిన జర్నలిస్టులు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహమూద్ అలీకి సోయ తప్పి మాట్లాడుతున్నాడని పాశం యాదగిరి అన్నారు. సెంటిమెంట్‌తో కూడిన అంశాల మీద డిప్యూటీ సీఎం అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెఛ్ అన్నారు. హెరిటేజ్ భవనాలకు మరమ్మతులు చేయాలే తప్ప కూల్చుకుంటూ పోతే ఒక్క పురాతన కట్టడం కూడా భావి తరాలు చూడలేదని తెలుగుదేశం నాయకులు ప్రకాష్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటేనే అందరికీ చార్మినార్ గుర్తొస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకే తలమానికమైన చార్మినార్‌ను కూలుస్తామనడం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ‘సేవ్ హైదరాబాద్ కమిటీ’ మహమూద్ అలీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.