ఉరిశిక్షలు కొనసాగుతాయి: జైట్లీ
ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు ఉరిశిక్ష అమలు తప్పదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. యాకుబ్‌ను ఉరి తీయడం బాధ కలిగించిందంటున్న కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ హంతకులను ఉరి తీసేటప్పుడు ఇలాంటి బాధ కలగలేదా అని ఆయన ప్రశ్నించారు. ముంబై పేలుళ్ల కేసులో మిగతా దోషులు దొరికితే వారిని కూడా ఉరి తీయాల్సిందేనని జైట్లీ అభిప్రాయపడ్డారు. ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరి తర్వాత ఈ ప్రకటన చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం […]
Advertisement
ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు ఉరిశిక్ష అమలు తప్పదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. యాకుబ్‌ను ఉరి తీయడం బాధ కలిగించిందంటున్న కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ హంతకులను ఉరి తీసేటప్పుడు ఇలాంటి బాధ కలగలేదా అని ఆయన ప్రశ్నించారు. ముంబై పేలుళ్ల కేసులో మిగతా దోషులు దొరికితే వారిని కూడా ఉరి తీయాల్సిందేనని జైట్లీ అభిప్రాయపడ్డారు. ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరి తర్వాత ఈ ప్రకటన చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది.
Advertisement