ట్యాపింగ్ పేరుతో ఏపీ వేధింపు: కవిత
ఓటుకు నోటు విషయంలో ఏపీ ప్రభుత్వం తమపై ఫోన్ ట్యాపింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తోందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఫిర్యాదు చేశారు. ఇతర ఎంపీలతో కలిసి ఆమె హోంమంత్రి రాజ్‌నాధ్‌ను కలిసారు. అంతకుముందు ఉమ్మడి హైకోర్టును విభజంచి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో మౌన పోరాటం చేశారు. లోక్‌సభలోని ట్రెజరీ స్ధానంలో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనపోరాటం చేశారు. హైకోర్టు విభజనతో […]
Advertisement
ఓటుకు నోటు విషయంలో ఏపీ ప్రభుత్వం తమపై ఫోన్ ట్యాపింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తోందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఫిర్యాదు చేశారు. ఇతర ఎంపీలతో కలిసి ఆమె హోంమంత్రి రాజ్‌నాధ్‌ను కలిసారు. అంతకుముందు ఉమ్మడి హైకోర్టును విభజంచి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో మౌన పోరాటం చేశారు. లోక్‌సభలోని ట్రెజరీ స్ధానంలో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనపోరాటం చేశారు. హైకోర్టు విభజనతో పాటు రాష్ట్ర అంశాలపై కూడా పోరాటం సాగిస్తామని కవిత తెలిపారు.
Advertisement