ఇక వాయిస్ శాంపిళ్ల సేక‌ర‌ణ‌

ఓటుకు నోటు కేసు మ‌రో మ‌లుపు తిర‌గ‌బోతోంది. ఎమ్మెల్యే స్టీఫెన‌స‌న్ ను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నించగా తీసిన వీడియోలతోపాటు సెబాస్టియ‌న్‌, మ‌త్త‌య్య‌, ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ల వాయిస్‌ల టేపులు నిజ‌మైన‌వని ఎఫ్ఎస్ ఎల్ నిర్ధారించిన‌ నేప‌థ్యంలో త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ఏసీబీ సిద్ధ‌మ‌వుతోంది. నిందితుల‌ వాయిస్ శాంపిళ్ల సేక‌ర‌ణ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందుకోసం వారికి నోటీసులు జారీ చేయాలని తొలుత అనుకుంది. వారు సాంకేతికంగా అభ్యంత‌రాలు లేవ‌దీసే అవ‌కాశం ఉండ‌టంతో ఏసీబీ […]

Advertisement
Update:2015-08-01 05:49 IST
ఓటుకు నోటు కేసు మ‌రో మ‌లుపు తిర‌గ‌బోతోంది. ఎమ్మెల్యే స్టీఫెన‌స‌న్ ను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నించగా తీసిన వీడియోలతోపాటు సెబాస్టియ‌న్‌, మ‌త్త‌య్య‌, ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ల వాయిస్‌ల టేపులు నిజ‌మైన‌వని ఎఫ్ఎస్ ఎల్ నిర్ధారించిన‌ నేప‌థ్యంలో త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ఏసీబీ సిద్ధ‌మ‌వుతోంది. నిందితుల‌ వాయిస్ శాంపిళ్ల సేక‌ర‌ణ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందుకోసం వారికి నోటీసులు జారీ చేయాలని తొలుత అనుకుంది. వారు సాంకేతికంగా అభ్యంత‌రాలు లేవ‌దీసే అవ‌కాశం ఉండ‌టంతో ఏసీబీ రూటు మార్చింది. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, వెంక‌ట‌వీర‌య్య‌ల గొంతుల‌ను నిర్ధారించుకునేందుకు అసెంబ్లీ వీడియోల‌ను, సెబాస్టియ‌న్‌, మ‌త్త‌య్య‌ల గొంతుల‌ను స‌రిపోల్చుకునేందుకు వారు మీడియాతో మాట్లాడిన వీడియోల‌ను సేక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం వారు గతంలో వివిధ చానళ్లతో మాట్లాడిన టేపులను సీఆర్‌పీసీ 91వ సెక్షన్ కింద సేకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీని ఆధారంగా మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏసీబీ భావిస్తోంది. అందుకే నిందితుల‌కు నేరుగా నోటీసులు ఇస్తే కేసు జాప్య‌మ‌వుతుంద‌న్న ముందుజాగ్ర‌త్త‌తో వ్యూహాన్నీ మార్చి అమ‌లు చేస్తోంది. నిర్ధారించిన ప‌త్రాల‌తో న్యాయ‌స్థానం ముందుకు వెళ్లాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే సెబాస్టియ‌న్ సెల్‌ఫోన్ల‌లో రికార్డ‌యిన సంభాష‌ణ‌ల‌ను కాగితంపై ముద్రించేందుకు (ట్రాన్సిస్ర్కిప్టు) ప‌ని పూర్త‌యింది. ఎఫ్ ఎస్ ఎల్ వీటిని నిర్ధారించి కోర్టుకు స‌మ‌ర్పించ‌నుంది. వాటి ఆధారంగా మ‌రింత మందికి నోటీసులు వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.
Tags:    
Advertisement

Similar News