ఇక గుంటూరు నుంచే తెలుగుదేశం వ్యవహారాలు
తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను విజయవాడ, గుంటూరుల నుంచే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సీఎం కోసం విజయవాడలో ఇప్పటికే క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. మంత్రులు కూడా హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచి పని చేసేందుకే ఇష్టపడుతున్నారు. అత్యవసర ఫైళ్లపై సంతకాలు చేసేందుకు మాత్రమే హైదరాబాద్ వస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సేవా కార్య్రమాలను గుంటూరు నుంచి నిర్వహించనున్నారు. ఎన్‌టీఆర్ భవన్ కోసం గుంటూరులో స్థల సేకరణ కూడా పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి […]
Advertisement
తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను విజయవాడ, గుంటూరుల నుంచే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సీఎం కోసం విజయవాడలో ఇప్పటికే క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. మంత్రులు కూడా హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచి పని చేసేందుకే ఇష్టపడుతున్నారు. అత్యవసర ఫైళ్లపై సంతకాలు చేసేందుకు మాత్రమే హైదరాబాద్ వస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సేవా కార్య్రమాలను గుంటూరు నుంచి నిర్వహించనున్నారు. ఎన్‌టీఆర్ భవన్ కోసం గుంటూరులో స్థల సేకరణ కూడా పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో మనరాష్ట్రం, మనపాలన అనే సిద్ధాంతాన్ని పాటించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో విజయవాడ నుంచే పరిపాలన సాగించాలని ముఖ్యనేతలు అభిప్రాయపడడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement