ప్రత్యేక హోదాపై బాంబు పేల్చిన కేంద్ర మంత్రి
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌సింగ్ శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ విధమైన ప్రకటన చేయడం ద్వారా లోక్‌సభలో కేంద్రమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆశలపై బాంబు పేల్చారు. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని చెప్పడం ద్వారా కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్ళు చల్లినట్టయ్యింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కేవలం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు మాత్రమే […]
Advertisement
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌సింగ్ శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ విధమైన ప్రకటన చేయడం ద్వారా లోక్‌సభలో కేంద్రమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆశలపై బాంబు పేల్చారు. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని చెప్పడం ద్వారా కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్ళు చల్లినట్టయ్యింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కేవలం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు మాత్రమే ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం ఇంత కీలకమైన ప్రకటన చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీలంతా సభలోనే ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా నోరు మెదపలేదు. కేంద్రం ఇలాంటి ప్రకటన మరోసారి చేయడం తెలుగుదేశం ప్రభుత్వానికే కాదు… రాష్ట్రంలో నిలదొక్కుకోవాలనుకుంటున్న భారతీయ జనతాపార్టీకి కూడా ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Advertisement