సమాచార హక్కుతో కేసుల పరిష్కారం సులభం
న్యాయస్ధానాల్లో కొన్ని కేసులను సులభంగా పరిష్కరించడానికి సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపకరిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ రచించిన ఆర్టీఐ యూజ్ అండ్ అబ్యూజ్ అనే పుస్తకాన్ని ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు. పదేళ్ల ఆర్టీఐ చట్టంపై రూపొందించిన మరో పుస్తకాన్ని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ విజయశర్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంతో సమగ్ర సమాచారం లభిస్తోందని అందువల్ల కొన్ని […]
Advertisement
న్యాయస్ధానాల్లో కొన్ని కేసులను సులభంగా పరిష్కరించడానికి సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపకరిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ రచించిన ఆర్టీఐ యూజ్ అండ్ అబ్యూజ్ అనే పుస్తకాన్ని ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు. పదేళ్ల ఆర్టీఐ చట్టంపై రూపొందించిన మరో పుస్తకాన్ని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ విజయశర్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంతో సమగ్ర సమాచారం లభిస్తోందని అందువల్ల కొన్ని కేసులను పరిష్కరించడం కూడా సులభమవుతోందని అన్నారు. గతంలో సమాచారం కోసం న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Advertisement