తెలుగుదేశం పొమ్మంటోంది.. పో.. కదలిపో!

నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు..” తెలుగుదేశం పిలుస్తోంది రా..కదలిరా..!”  పిలుపుతో ఎంతో మంది కదలివచ్చారు. అన్న ఎన్టీఆర్ వెంట నడిచారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకొచ్చింది  టీడీపీ. ఎన్టీఆర్ త‌రువాత‌ నారా వారి చంద్రకాంతిలో తెలుగుదేశం వెల‌గాల్సి వ‌చ్చింది. అయితే కాలం మారింది. బాబుకో కోట‌రీ ఏర్ప‌డింది. చిన‌బాబు ప‌ట్టాభిషేకం ఆల‌స్య‌మ‌వుతోంది. చిన‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ప్ర‌స్తుతం, భ‌విష్య‌త్‌లోనూ అడ్డంవ‌చ్చే సీనియ‌ర్ల‌ను గుర్తించి కొత్త స్కీం అమ‌లు చేయ‌నారంభించింది.  ” తెలుగుదేశం పిలుస్తోంది రా..కదలిరా..!” నినాదాన్ని మార్చి […]

Advertisement
Update:2015-07-31 08:29 IST
నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు..” తెలుగుదేశం పిలుస్తోంది రా..కదలిరా..!” పిలుపుతో ఎంతో మంది కదలివచ్చారు. అన్న ఎన్టీఆర్ వెంట నడిచారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకొచ్చింది టీడీపీ. ఎన్టీఆర్ త‌రువాత‌ నారా వారి చంద్రకాంతిలో తెలుగుదేశం వెల‌గాల్సి వ‌చ్చింది. అయితే కాలం మారింది. బాబుకో కోట‌రీ ఏర్ప‌డింది. చిన‌బాబు ప‌ట్టాభిషేకం ఆల‌స్య‌మ‌వుతోంది. చిన‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ప్ర‌స్తుతం, భ‌విష్య‌త్‌లోనూ అడ్డంవ‌చ్చే సీనియ‌ర్ల‌ను గుర్తించి కొత్త స్కీం అమ‌లు చేయ‌నారంభించింది. ” తెలుగుదేశం పిలుస్తోంది రా..కదలిరా..!” నినాదాన్ని మార్చి ” తెలుగుదేశం పొమ్మంటోంది.. పో.. కదలిపో! అనే కొత్త నినాదం అందుకుంది బాబు కోట‌రీ. ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లను పొమ్మనకుండా పొగబెడుతోంది. ఈ ప‌నిని చంద్ర‌బాబు ప‌రోక్షంలో ఆయ‌న కోట‌రీయే చ‌క్క‌బెడుతోంద‌ని స‌మాచారం.
రాజుగోరుపై కోపం అందుకేనా?
తెలుగుదేశంలో చంద్రబాబు కంటే సీనియర్ కేంద్రమంత్రి అశోక్ గ‌జపతిరాజు. అయినా బాబు మాట ఏనాడూ రాజుగారు దాటింది లేదన్నది పార్టీలో సీనియర్లు చెబుతున్న మాట. అయితే ఇటీవల ఓటుకు నోటు కేసులో బాబు సీఎం పదవికి రాజీనామా చేయకతప్పదనే ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు తరువాత సీఎం ఎవరవుతారని ..మీడియా కథనాలు వండివార్చింది. మీడియా ఊహాగానాల్లో టీడీపీలో అందరికంటే సీనియర్, బాబుకు అత్యంత నమ్మకస్తుడు, నిజాయితీపరుడు అయిన అశోక్ గ‌జపతిరాజు పేరు పతాకశీర్షికలకు ఎక్కింది. చినబాబుకు ఎప్పుడెప్పుడు పట్టాభిషేకం చేద్దామా చంద్రబాబు ఉవ్విళ్లూరుతుంటే.. అశోక్ పేరు తెరపైకి రావడం బాబు జీర్ణించుకోలేకపోయారట…. అయితే ఈ విషయంపై ఎక్కడా బయటపడకుండా నివురుగప్పిన నిప్పులా ఉన్న బాబు..ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీపీ సమావేశంలో ఇతర కారణాలను చూపుతూ రాజుగారిపై బరస్టయ్యారు బాబు. కేంద్రమంత్రిగా ఉండి..ఏపీకి నిధులు, ప్రాజెక్టులు సాధించలేకపోతున్నారని అశోక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట బాబు. తాను శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నానని చెప్పిన అశోక్.. … మీకు ఇష్టంలేకపోతే చెప్పండి క్షణాల్లో రాజీనామా చేస్తానని బాబుకు చెప్పారట.. . ఏంచేయాలో పాలుపోని బాబు..టాపిక్ డైవర్ట్ చేసి అశోక్ ని సముదాయించారట.
అందు”కే….ఈ” వివ‌క్షా?
కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తన శాఖలోనూ, పార్టీలోనూ ఎదురవుతున్న అవమానాలను భరించలేకపోతున్నారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు చినబాబు కంకణం కట్టుకున్నారని, దీనిని పెదబాబు ఆచరిస్తున్నారని కేఈ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. జిల్లాల‌కు ఇన్‌చార్జ్ మంత్రుల నియామ‌కంలోనూ త‌న‌ను ప‌క్క‌న‌బెట్ట‌డం, త‌న శాఖ ఫైళ్ల క‌ద‌లిక‌ల‌పై నిఘా వంటి అంశాల‌పై కేఈ తీవ్ర అస‌హ‌నంతో ఉన్నార‌ట. . ఒకానొక ద‌శ‌లో త‌న‌ను గ‌వ‌ర్న‌ర్‌గా పంపాల‌ని బాబుకు మొర‌పెట్టుకున్నార‌ట కేఈ.
సీనియర్ అయితే బాబు సీరియస్
పార్టీలో సీనియ‌ర్‌.. అయితే వారిని అప్రాధాన్య పోస్టుల‌కు ప‌రిమితం చేయ‌డంలో చంద్ర‌బాబు త‌న చాణ‌క్యం చూపారు. టీడీపీలో నెంబ‌ర్ రేసు ఉండ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తోనే కోడెల‌ను స్పీక‌ర్ కుర్చీకి ప‌రిమితం చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎక్కువ‌సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప‌తివాడ నారాయ‌ణ‌స్వామి నాయుడు ప‌క్క‌న‌బెట్ట‌డం ద్వారా తాను సీనియ‌ర్ల‌ను దూరం పెట్టాల‌నుకుంటున్నాన‌నే ప‌రోక్ష సంకేతాల‌నిచ్చారు బాబు. విశాఖ‌కు చెందిన సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా..ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై బాబు ఓ క‌న్నేసి ఉంచార‌ట . పార్టీలో మ‌రో సీనియ‌ర్ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిని మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించి, పార్టీ ప‌ద‌వుల్లోకి తీసుకురావాల‌న్న ఆలోచ‌న కూడా ఉంద‌ట‌…
చిన‌బాబు కోస‌మేనా ఇదంతా?
ఎవ‌రూ ఎన్నుకోని ప‌ద‌వి అయిన‌ తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి క‌న్వీన‌ర్ హోదాలో ఉన్న లోకేశ్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై తీవ్ర‌మైన బెంగ‌తో ఉన్నార‌ట‌ బాబు. చిన‌బాబు ఫ్యూచ‌ర్‌కు ఏ ఒక్క సీనియ‌ర్ అడ్డు కాకుండా ఉండేందుకు పెద బాబు వేసిన స్కెచ్‌లో భాగ‌మే ఇదంతా అని అసంతృప్తులైన టీడీపీ నేత‌లు లీకులిస్తున్నారు. జూనియ‌ర్ బాబు కోసం సీనియ‌ర్ బాబు త‌న కంటే పార్టీలో సీనియ‌ర్ల‌ను పొమ్మ‌న‌కుండా పొగ‌బెడుతున్నార‌నేది ఈ సంఘ‌ట‌న‌లు చూస్తే అర్థ‌మ‌వుతోంద‌ని సీనియ‌ర్ త‌మ్ముళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News