విదేశీ జైళ్లలో భారతీయులు
జాతీయ సరిహద్దులు ఉల్లంఘించారన్న పలు నేరారోపణలపై వేలాది మంది భారతీయులు విదేశీ జైళ్లలో మగ్గుతున్నారు. సౌదీ, యుఏఈ వంటి అరబ్ దేశాల జైళ్లలో 11,500 మంది భారతీయులు ఉన్నారని ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వికె సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సౌదీ అరేబియాలో 4,615, యుఏఈలో 6,653, ఒమన్‌లో 454, ఖతార్‌లో 187 మంది, యునైటెడ్ కింగ్డమ్‌లో 1,467, సింగపూర్‌లో 450, మలేషియాలో 294 మంది, నేపాల్‌లో 996, భూటాన్‌లో 275, మయన్మార్‌లో 126, […]
Advertisement
జాతీయ సరిహద్దులు ఉల్లంఘించారన్న పలు నేరారోపణలపై వేలాది మంది భారతీయులు విదేశీ జైళ్లలో మగ్గుతున్నారు. సౌదీ, యుఏఈ వంటి అరబ్ దేశాల జైళ్లలో 11,500 మంది భారతీయులు ఉన్నారని ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వికె సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సౌదీ అరేబియాలో 4,615, యుఏఈలో 6,653, ఒమన్‌లో 454, ఖతార్‌లో 187 మంది, యునైటెడ్ కింగ్డమ్‌లో 1,467, సింగపూర్‌లో 450, మలేషియాలో 294 మంది, నేపాల్‌లో 996, భూటాన్‌లో 275, మయన్మార్‌లో 126, చైనాలో 25, మాల్దీవుల్లో 39 మంది, పాక్ జైళ్లలో 74 మంది శిక్ష అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. ఆయా ప్రభుత్వాలు భారత ఖైదీలను 2012 నుంచి 2015 మధ్య అరెస్టు చేశాయని ఆయన వెల్లడించారు. ఇటీవల కాలంలో ఖతార్ 88, ఒమన్ 99 మందిని విడుదల చేశాయని ఆయన తెలిపారు.
Advertisement