రేవంత్ నిబంధనల చట్రంలో ఉండాల్సిందే: హైకోర్టు
ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ షరతులను సడలించేందుకు హైకోర్టు తిరస్కరించింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు బెయిల్ షరతులను సడలించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి అనుమతిస్తే ఏసీబీ దర్యాప్తు ప్రభావితం అవుతుందని, ఆరోగ్య కారణాలు, కుటుంబ కార్యక్రమాలకు సడలింపు ఇస్తే […]
Advertisement
ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ షరతులను సడలించేందుకు హైకోర్టు తిరస్కరించింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు బెయిల్ షరతులను సడలించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి అనుమతిస్తే ఏసీబీ దర్యాప్తు ప్రభావితం అవుతుందని, ఆరోగ్య కారణాలు, కుటుంబ కార్యక్రమాలకు సడలింపు ఇస్తే అభ్యంతరం లేదని వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో రేవంత్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Advertisement