గులాబీ పార్టీలో అసమ్మతి తమ్ముళ్లు
అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి చాపకింద నీరులా పాకుతోంది. పద్నాలుగేళ్లుగా పార్టీకి కొమ్ముకాసిన వారిలో కొందరికి మాత్రమే ఉన్నత పదవులు లభించడం చాలామందికి నామమాత్రపు పదవులు కూడా దక్కక పోవడంతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడం ఆపార్టీలో అంతర్గత విభేదాలకు కారణంగా కనిపిస్తోంది. దీంతో పార్టీ కార్యకర్తలు నేతల వారీగా విడిపోయారు. వీరి మధ్య సయోధ్య కుదర్చడం అగ్రనేతలకు కూడా సాధ్యం కావడం లేదు. పైగా పాత కొత్త నేతల మధ్య ఏర్పడుతున్న […]
Advertisement
అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి చాపకింద నీరులా పాకుతోంది. పద్నాలుగేళ్లుగా పార్టీకి కొమ్ముకాసిన వారిలో కొందరికి మాత్రమే ఉన్నత పదవులు లభించడం చాలామందికి నామమాత్రపు పదవులు కూడా దక్కక పోవడంతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడం ఆపార్టీలో అంతర్గత విభేదాలకు కారణంగా కనిపిస్తోంది. దీంతో పార్టీ కార్యకర్తలు నేతల వారీగా విడిపోయారు. వీరి మధ్య సయోధ్య కుదర్చడం అగ్రనేతలకు కూడా సాధ్యం కావడం లేదు. పైగా పాత కొత్త నేతల మధ్య ఏర్పడుతున్న బేధాభిప్రాయాలతో మరిన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఈ సమస్యలకు తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్ఎల్‌సీలు కూడా వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలా వద్దా అన్న విషయంపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
Advertisement