ఐదుగురు మంత్రులు ఇంటిదారి..?
త్వరలో ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారా…? జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. ఏడాది పాలన పూర్తి కాగానే మంత్రివర్గంలో మార్పులు చేయాలని చంద్రబాబు భావించారు. అయితే అనేక ఉదంతాలు, ఉపద్రవాలతో అది వాయిదా పడుతూ వస్తున్నది. తొలుత ఓటుకు కోట్లు అంశం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆ తర్వాత పుష్కరాలను ఘనంగా నిర్వహించి ఆ మచ్చ నుంచి జనం దృష్టిని మరలిద్దామని ఆయన భావిస్తే అందులో […]
Advertisement
త్వరలో ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారా…? జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. ఏడాది పాలన పూర్తి కాగానే మంత్రివర్గంలో మార్పులు చేయాలని చంద్రబాబు భావించారు. అయితే అనేక ఉదంతాలు, ఉపద్రవాలతో అది వాయిదా పడుతూ వస్తున్నది. తొలుత ఓటుకు కోట్లు అంశం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆ తర్వాత పుష్కరాలను ఘనంగా నిర్వహించి ఆ మచ్చ నుంచి జనం దృష్టిని మరలిద్దామని ఆయన భావిస్తే అందులో ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. 29 మంది భక్తుల మరణం చంద్రబాబు సర్కారు పనితీరుకు ప్రశ్నార్థకంగా మారింది. ఇపుడు పరిస్థితి కొంచెం కుదుటపడినందున ఇక ప్రక్షాళనపై దృష్టిసారించాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం. మూడు రోజుల్లో చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చిన తరువాత మంత్రివర్గ మార్పులు, చేర్పులపై దృష్టి పెడతారని భావిస్తున్నారు. రెండో తేదీన ఆయన కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన ఏ దేశానికి అన్నది రహస్యంగా ఉంచినప్పటికీ, టర్కీకి వెళ్లే అవకాశా లున్నాయని తెలుస్తోంది. ఆ తరువాత అధికారిక పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు కూడా వెళ్లనున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ విస్తరణలో కనీసం ఐదుగురు మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వారిలో ఇద్దరికి ఉద్వాసన ఉంటుందని అరటున్నారు. ఆ ఇద్దరి పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన పేషీ అధికారులే అంటున్నారు. ఇదే సమయంలో కొరతమందిపై వస్తున్న అవినీతి ఆరోపణలు, పనితీరును సరిగా లేకపోవడం వంటి అంశాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోరది. ఈ నేపథ్యంలో అటువంటి వారిపై కూడా వేటు తప్పదన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోరది. మరోవైపు అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నవారి జాబితా పెద్దదిగానే ఉంది. మార్పులు చేర్పులు అనివార్యమని, అందరూ అందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యనాయకులకు ఇప్పటికే సమాచారముందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
Advertisement