బెజవాడ కోర్టుకు సీల్డ్ కవరులో కాల్‌డేటా
ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురు సర్వీస్ ప్రొవైడర్లు బెజవాడ కోర్టుకు హాజరై సీల్డ్ కవరులో కాల్‌డేటాను అందజేశారు. ఈ కేసులో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, రిలయెన్స్, ఐడియా సర్వీస్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న డేటాను సమర్పించారు. కవరులో ఉన్న వివరాలు తమకు తెలియవని బీఎస్‌ఎన్‌ఎల్ తరపు న్యాయవాది సుబ్రమణ్యం చెప్పారు. నోడల్ అధికారి సమక్షంలో సీలు వేసి నేరుగా జడ్జీకి అందజేశామని న్యాయవాది పేర్కొన్నారు. 150 రోజుల కాల్‌డేటా వివరాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోరిందని, […]
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురు సర్వీస్ ప్రొవైడర్లు బెజవాడ కోర్టుకు హాజరై సీల్డ్ కవరులో కాల్‌డేటాను అందజేశారు. ఈ కేసులో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, రిలయెన్స్, ఐడియా సర్వీస్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న డేటాను సమర్పించారు. కవరులో ఉన్న వివరాలు తమకు తెలియవని బీఎస్‌ఎన్‌ఎల్ తరపు న్యాయవాది సుబ్రమణ్యం చెప్పారు. నోడల్ అధికారి సమక్షంలో సీలు వేసి నేరుగా జడ్జీకి అందజేశామని న్యాయవాది పేర్కొన్నారు. 150 రోజుల కాల్‌డేటా వివరాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోరిందని, ఆ మేరకు వివరాలు అందజేశామని న్యాయవాది వివరించారు.
Advertisement