పోకిరీలకు పోయేకాలం
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే మహా అయితే 50 రూపాయల జరిమానా. ఇంకా తీవ్రంగా ఉంటే 4 రోజుల జైలు శిక్ష. ఇప్పటివరకూ ఇదే అలుసుగా ఆకతాయిలు రెచ్చిపోయారు. పోకిరీలు చెలరేగిపోయారు. అయితే కొత్త చట్టంతో వీరికి చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజా చట్టం అమలులోకి వస్తే గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోబస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లతోపాటు కాలేజీలు, నడిరోడ్లు అడ్డాగా ఈవ్ టీజర్లు చెలరేగిపోతున్నారు. […]
Advertisement
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే మహా అయితే 50 రూపాయల జరిమానా. ఇంకా తీవ్రంగా ఉంటే 4 రోజుల జైలు శిక్ష. ఇప్పటివరకూ ఇదే అలుసుగా ఆకతాయిలు రెచ్చిపోయారు. పోకిరీలు చెలరేగిపోయారు. అయితే కొత్త చట్టంతో వీరికి చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజా చట్టం అమలులోకి వస్తే గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోబస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లతోపాటు కాలేజీలు, నడిరోడ్లు అడ్డాగా ఈవ్ టీజర్లు చెలరేగిపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి షీ టీమ్స్ వీరిని పట్టుకుంటున్నాయి. అయితే కఠినచట్టాలు లేకపోవడంతో వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలివేస్తున్నారు. అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తే గరిష్టంగా 50 రూపాయలు ఫైన్ పడుతోంది. ఇంకా శిక్షించాల్సి వస్తే ఓ 4 రోజుల జైలు శిక్ష పడుతోంది. 50 చెల్లించి బయటకొచ్చే పోకిరీలు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఈవ్‌టీజర్ల ఆగడాలు మితిమీరిపోవడానికి ఇదే ప్రధాన కారణమని గుర్తించారు అధికారులు. కఠినశిక్షల అమలు చేస్తేనే వీటికి అడ్డుకట్ట వేయొచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఈవ్‌టీజర్లపై తమిళనాడు అనుసరిస్తున్న చట్టాలను అధ్యయనం చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఒక యాక్ట్ తయారు చేశారు. దీనికి కేంద్రప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే పోకిరీలకు పోయేకాలం దాపురించినట్టే.
కఠిన శిక్షలు.. భారీ జరిమానాలు
ఈవ్‌టీజర్ల భరతం పట్టేందుకు తెలంగాణ పోలీసులు రూపొందించిన ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్ లో కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయి. మహిళలను వేధించే నిందితులకు ఒక నెల నుంచి రెండేళ్ల వరకూ జైలు శిక్ష, 30 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. పోకిరీల వేధింపులు తాళలేక మహిళలు చనిపోతే.. ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకూ జైలుశిక్ష, 30 వేల నుంచి 2 లక్షల వరకూ జరిమానా పడనుంది. ఈవ్‌టీజింగ్‌కు గురై మనస్తాపంతో ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే ..నిందితుడికి ఏడాది నుంచి పదేళ్ల వరకూ జైలు, 50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకూ జరిమానా వేసేటట్లు ఈ యాక్ట్ రూపొందించారు.
మరి మైనర్‌బాబుల సంగతో?
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నవారిలో మైనర్లు ఎక్కువ మంది ఉంటున్నారు. మరి వీరి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ యాక్ట్ లో పొందుపరచలేదు. ఇటీవల కాలంలో నమోదైన ఈవ్‌టీజింగ్ కేసుల్లో ఎక్కువ మైనర్లవే. మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేస్తున్నారు. దీంతో వారు మళ్లీ నడిరోడ్లపై పడి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు.
Advertisement