విమానయానంపై త్వరలో ఓపెన్ స్కై విధానం
విమాన మార్గాలను పరిమిత స్థాయిలో విస్తరించే విధానం ఓపెన్ స్కై ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విధానాన్ని అమలు చేస్తే 5 వేల కి.మీ దూరం లేదా 7 గంటల గగన ప్రయాణ సమయం ఉన్న పౌర విమానాలకు అపరిమిత సంఖ్యలో అనుమతించాల్సి ఉంటుంది. ఓపెన్‌స్కై విధానాన్ని అంగీకరించే దేశాలకు ఈ విస్తరణ ప్రతిపాదన వర్తింప చేయాలని కేంద్రం భావిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు భారత్‌కు అపరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడపాల్సి ఉంటుంది. కొత్త పౌర […]
Advertisement
విమాన మార్గాలను పరిమిత స్థాయిలో విస్తరించే విధానం ఓపెన్ స్కై ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విధానాన్ని అమలు చేస్తే 5 వేల కి.మీ దూరం లేదా 7 గంటల గగన ప్రయాణ సమయం ఉన్న పౌర విమానాలకు అపరిమిత సంఖ్యలో అనుమతించాల్సి ఉంటుంది. ఓపెన్‌స్కై విధానాన్ని అంగీకరించే దేశాలకు ఈ విస్తరణ ప్రతిపాదన వర్తింప చేయాలని కేంద్రం భావిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు భారత్‌కు అపరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడపాల్సి ఉంటుంది. కొత్త పౌర విమానయాన విధానం ఖరారు చేసే ముందు ప్రజాభిప్రాయం కోసం ప్రభుత్వం ఇంటర్నెట్‌లో ఉంచుతుంది. ఓపెన్ స్కై ఒప్పందం వల్ల ఎయిర్ ఫ్రాన్స్, కెఎల్ఎం, లుఫ్తాన్సా, స్విస్, బ్రిటీష్ ఎయిర్‌వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి ఐరోపా దేశాలతోపాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలకు ప్రయోజనం కలుగుతుంది. దేశీయ సంస్థలు ఎయిర్ ఇండియా, జెట్ విమానయాన సంస్థలకు కూడా ఉపయోగం కలుగుతుంది.
Advertisement