తవ్వని సొరంగానికి అడ్వాన్స్‌లు అ'ధనం'!
ఒక్క రాష్ర్టం రెండయ్యింది. ప్రభుత్వాలు మారిపోయాయి. అంచనా వ్యయం రెండింతలైంది. కానీ పనులు మాత్రం అలాగే ఉన్నాయి. అదే కాంట్రాక్టర్, అదే పని. ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం రెండుసార్లు ప్రత్యేకంగా అడ్వాన్స్‌ల రూపంలో అ”ధనం” అందజేసింది. అయినా పనులు కదల్లేదు. ఇదీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం దుస్థితి. సొరంగం పనుల పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. 2005లో పనుల […]
Advertisement
ఒక్క రాష్ర్టం రెండయ్యింది. ప్రభుత్వాలు మారిపోయాయి. అంచనా వ్యయం రెండింతలైంది. కానీ పనులు మాత్రం అలాగే ఉన్నాయి. అదే కాంట్రాక్టర్, అదే పని. ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం రెండుసార్లు ప్రత్యేకంగా అడ్వాన్స్‌ల రూపంలో అ”ధనం” అందజేసింది. అయినా పనులు కదల్లేదు. ఇదీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం దుస్థితి. సొరంగం పనుల పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది.
2005లో పనుల ప్రారంభం
ఏఎంఆర్పీ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించే పథకం పనులు చేపట్టేందుకు 2005లో జయప్రకాశ్ అసోసియేట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 1925 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను 2010లో పూర్తి చేయాలనేది లక్ష్యం. 43.7 కిలోమీటర్ల ప్రధాన సొరంగంతోపాటు మరో 7 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిలో సొరంగం తవ్వేందుకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా అందుకుందీ జై ప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ.
అడగడుగునా ఆటంకాలే
సొరంగం పనులు ప్రారంభం నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. 2009లో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు సొరంగం పనులు మొదలైన వైపు మట్టితో పూడికపోయింది. దీంతో పనులు నిలిచిపోయాయి. తిరిగి పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. అయినా పనులు ముందుకు సాగలేదు.
తెలంగాణ ప్రభుత్వం చొరవ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం పనులు పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను ఆదేశించింది. జయప్రకాశ్ అసోసియేట్స్‌కే ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే బాధ్యత అప్పగించి, గడువు నిర్దేశించాలని విపక్షాలు ఇచ్చిన సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుంది తెలంగాణ సర్కార్. కాంట్రాక్టర్ అభ్యర్థన మేరకు అంచనా వ్యయం పెంచేందుకు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. మరో వంద కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది.
కాంట్రాక్టర్ చెబుతున్న కారణాలు ఇవీ..
సొరంగం తవ్వకంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంట్రాక్ట్ సంస్థ చెబుతోంది. తవ్వకంలో రాయి అడ్డం వచ్చి టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోయిందని, కన్వేయర్ బెల్ట్ పాడైందని సాకులు చూపుతోంది జయప్రకాశ్ అసోసియేట్స్. రెండుసార్లు అడ్వాన్స్ లు తీసుకుని, అంచనా వ్యయం పెంచుకున్న సంస్థ ..తమకు ప్రభుత్వం నుంచి ఇంకా రూ.136 కోట్లు రావాల్సి ఉందని చెబుతోంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు సాకుగా చూపుతోంది. 43.7 కిలోమీటర్ల ప్రధాన సొరంగం తవ్వకానికి విధించిన గడువు ఎప్పుడో దాటిపోయింది. పదేళ్లలో జయప్రకాశ్ అసోసియేట్స్‌కంపెనీ తవ్విన సొరంగం 25.5 కిలోమీటర్లే. తమకు రావాల్సిన బకాయిలు వచ్చిన తరువాత, యంత్రాలు బాగుపడ్డాక పనులు వేగవంతం చేస్తామని తమకు కాంట్రాక్టర్ చెప్పాడని ఎస్ ఎల్‌బీసీ అధికారులు వివరణ ఇస్తున్నారు.
Advertisement