ఆగస్టు 13న ఉస్మానియా ఎదుట మానవహారం
ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కార్పోరేట్ సంస్థల కోసమే నేలమట్టం చేస్తున్నారని హైదరాబాద్ జిందాబాద్ పౌరస్పందన వేదిక నేతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రోగుల ప్రాణానికి హాని జరిగితే ఊరుకోమని వారు సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ఆగస్టు 13వ తేదీన సేవ్ ఉస్మానియా పేరిట ఆస్పత్రి భవనం ఎదుట మానవహారం చేపడతామని ప్రకటించారు. చారిత్రక కట్టడాలను కూల్చివేస్తున్న కేసీఆర్ తన అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలని వక్తలు సూచించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో సేవ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ […]
Advertisement
ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కార్పోరేట్ సంస్థల కోసమే నేలమట్టం చేస్తున్నారని హైదరాబాద్ జిందాబాద్ పౌరస్పందన వేదిక నేతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రోగుల ప్రాణానికి హాని జరిగితే ఊరుకోమని వారు సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ఆగస్టు 13వ తేదీన సేవ్ ఉస్మానియా పేరిట ఆస్పత్రి భవనం ఎదుట మానవహారం చేపడతామని ప్రకటించారు. చారిత్రక కట్టడాలను కూల్చివేస్తున్న కేసీఆర్ తన అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలని వక్తలు సూచించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో సేవ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో పలువురు వైద్యులు, విద్యావేత్తలు, విప్లవోద్యమ నేతలు, గాయకులు పాల్గొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతను నిలిపివేయాలని వారు సీఎంను డిమాండ్ చేశారు.
Advertisement