అబ్దుల్ కలాంకు కన్నీటి వీడ్కోలు
తమిళనాడులోని రామేశ్వరం జన సంద్రమైంది. కన్నీటి ఆనవాళ్ళుగా మిగిలింది. ఎక్కడ చూసినా జనం… లక్షలాది మంది తమ ప్రియతమ నేత అబ్దుల్ కలాంను కడసారి వీక్షించడానికి పోటెత్తారు. త్రివిధ దళాధిపతుల తుది వీడ్కోలుతో… సైనిక లాంఛనాలతో మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాంకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, […]
Advertisement
తమిళనాడులోని రామేశ్వరం జన సంద్రమైంది. కన్నీటి ఆనవాళ్ళుగా మిగిలింది. ఎక్కడ చూసినా జనం… లక్షలాది మంది తమ ప్రియతమ నేత అబ్దుల్ కలాంను కడసారి వీక్షించడానికి పోటెత్తారు. త్రివిధ దళాధిపతుల తుది వీడ్కోలుతో… సైనిక లాంఛనాలతో మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాంకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, సిద్ధరామయ్య, ఉమెన్ చాంది, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రతినిధి గులాంనబీ అజాద్‌లు హాజరై ఈ దివంగత నేతకు కడసారి వీడ్కోలు పలికి అశ్రు నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, తమిళనాడుకు చెందిన మంత్రులు, అంతరిక్ష రంగానికి చెందిన శాస్త్రవేత్తలు, పలువురు ప్రముఖులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని, అక్కడి ఏర్పాట్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి పరీకర్‌లు పర్యవేక్షించారు. అబ్దుల్ కలాం పార్ధివ దేహాన్ని ఖననం చేసిన తర్వాత మత గురువులు ప్రార్థనలు నిర్వహించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
Advertisement