బాలయ్య బాటలో చంద్రబాబు
“హైటెక్ సిటీ సృష్టికర్తను నేను. సైబర్ సిటీకి రాళ్లెత్తిన పెద్ద కూలీనీ నేనే. హైదరాబాద్ అభివృద్ధి నా చలవ,. సాఫ్ట్‌వేర్ బూమ్ క్రియేట్ చేసిందే నేను. హార్డ్‌వేర్ తో ఉద్యోగావకాశాలు కల్పించిందీ నేనే “. అని రోజూ చెబుతుంటారు ఏపీ సీఎం చంద్రబాబు. తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో.. ఏపీలో, ఢిల్లీలో, విదేశీ పర్యటనల్లో చంద్రబాబు ఈ మంత్రం జపిస్తూనే ఉన్నారు. విజన్‌లు, రివిజన్‌లు, రివ్యూలు, నిద్రపోకపోవడం, నిద్రపోనివ్వకపోవడం కూడా బాబు మార్క్ వర్కింగ్ స్టైల్. బాబు […]
Advertisement
“హైటెక్ సిటీ సృష్టికర్తను నేను. సైబర్ సిటీకి రాళ్లెత్తిన పెద్ద కూలీనీ నేనే. హైదరాబాద్ అభివృద్ధి నా చలవ,. సాఫ్ట్‌వేర్ బూమ్ క్రియేట్ చేసిందే నేను. హార్డ్‌వేర్ తో ఉద్యోగావకాశాలు కల్పించిందీ నేనే “. అని రోజూ చెబుతుంటారు ఏపీ సీఎం చంద్రబాబు. తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో.. ఏపీలో, ఢిల్లీలో, విదేశీ పర్యటనల్లో చంద్రబాబు ఈ మంత్రం జపిస్తూనే ఉన్నారు. విజన్‌లు, రివిజన్‌లు, రివ్యూలు, నిద్రపోకపోవడం, నిద్రపోనివ్వకపోవడం కూడా బాబు మార్క్ వర్కింగ్ స్టైల్. బాబు సృష్టించానని చెబుతున్నవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం. చెబుతున్నవన్నీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ సబ్జెక్ట్‌లు. అయితే ఇదంతా బాబు ప్రసంగానికి ఒకవైపు మాత్రమేనని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు అంటే మూఢనమ్మకాల పుట్ట అట. వాస్తుపిచ్చి, ముహూర్తాలపై మొండిపట్టు, శకునాలు, సెంటిమెంట్లన్నింటికీ బాబు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తు బాగుందే… బాబు వాస్తు బాగుంది…
విజన్ 20-20 రూపకర్త. హైటెక్ ముఖ్యమంత్రిగా, ఏపీ సీఈవోగా పిలిపించుకోవాలని తహతహలాడి పదవికి దూరమైన బాబు.. మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడు. సాఫ్ట్‌వేర్‌తో పాలన, హార్డ్‌వేర్‌తో అభివృద్ధి సాధిస్తానని ఒకప్పుడు గొప్పలు చెప్పుకునే బాబు.. ఇప్పుడు చెప్పులు వేసుకునేందుకు కూడా ముహూర్తం చూస్తున్నారట ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వాస్తు మార్పులు పూర్తయ్యాయి. ఆ తరువాత అధికారంలోకి బాబు రావడంతో వాస్తు, ముహూర్తాలపై గురి ఎక్కువైందట. హైదరాబాద్‌లోని తన పాత ఇంటిని వాస్తు సమస్యల కారణంగానే కూలగొట్టారని సమాచారం. కొత్త ఇల్లు వాస్తు ప్రకారం నిర్మిద్దామనుకుంటే..అది కాస్త వికటించి జీహెచ్ ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్లాన్ రిజెక్టయ్యింది.
అన్నీ ముహూర్తం ప్రకారమే…
రాజధాని పేరు ప్రకటన, భూమిపూజ అన్నీ ముహూర్తం ప్రకారమే జరిపించారు బాబు. గోదావరి పుష్కరాల ప్రారంభం కూడా బాబు సెంటిమెంట్లను ప్రపంచం కళ్ల ముందు ఉంచింది. పుష్కరాలు ముగింపు తరువాత జరిగిన వనమహోత్సవంలో పాల్గొన్న బాబు మాట్లాడుతూ ఏ రాశి వారు ఏ చెట్టు నాటాలో కూడా బహిరంగసభలో చెప్పారు. మొక్కలతో పర్యావరణానికి ఎంతో మేలన్నది అందరికీ తెలిసిందే. దీనికి రాశి ఫలాలను జోడించడమేంటని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
బాబుకు బస్‌లోనే బస
తన రక్షణ, జిల్లా పర్యటనల కోసం తెప్పించుకున్న బుల్లెట్ ప్రూఫ్ బస్‌లోనే బాబు బస చేస్తున్నాడు. ఎందుకంటే… ఎక్కడైనా బయట ప్రదేశంలో నిద్రపోతే..ఏదో ఒక ఉపద్రవం వస్తోందట. అందుకే బస్‌ను వీడి బయట బసకు వెళ్లాలంటే బాబు హడలిపోతున్నారట. బస్‌లోనే నిద్రిస్తున్నారట. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతా అని ప్రకటిస్తూండే చంద్రబాబుకు సెంటిమెంట్లు పీడిస్తుంటే నిద్ర సమస్య ఎక్కువై బస్‌కే పరిమితమవడంపై తెలుగు తమ్ముళ్లు తెగ ఫీలైపోతున్నారు
వెయ్యి కాళ్ల మండపం పునర్మిర్మాణమా అందుకేనా?
టీటీడీ పాలకమండలి తాజా సమావేశంలో వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలని తీర్మానించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దీనిని కూల్చివేశారు. ఈ కూల్చివేత తీవ్ర వివాదాలకు కారణమైంది.మళ్లీ అధికారమైతే దక్కింది కానీ.. పరిస్థితులన్నీ వికటిస్తున్న దశలో తాను కూల్చివేయించిన వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
బాబుపై బాలయ్య ప్రభావం
శకునాలు, పూజలు సరేసరి. అడుగు తీసి అడుగు వేయాలంటే..వాస్తు చూస్తున్నారట. మంచి రోజా, చెడ్డరోజా, వర్జ్యం ఉందా లేదా తెలుసుకునీ మరీ పనులు ప్రారంభిస్తున్నారట. బాబు ఇంతగా సెంటిమెంట్ల ఊబిలో కూరుకుపోవడానికి బావమరిది బాలయ్యే కారణమనే విమర్శలూ లేకపోలేదు. భక్తి, మూఢనమ్మకాలకు పెట్టింది పేరైన బాలయ్య..తన బావ చంద్రబాబుకు ఎదురవుతున్న గడ్డు పరిస్థితులకు వాస్తు పాటించకపోవడం, ముహూర్తాలు చూడకపోవడమే కారణమని నూరిపోశారట. దీంతో బాబు మారిపోయారట. ఎంతగా మారిపోయారంటే ఎన్నికల సమయంలో దగ్గరైన ఒక పూజారి కమ్ జ్యోతిష్కుడు చెప్పినట్లే ఐఏఎస్‌ల పోస్టింగులు కూడా ఇచ్చారని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు.
Advertisement