కళాభారతిపై ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కేసు
రిక్రియేషన్ జోన్ కింద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం స్థలంలో కళాభారతి నిర్మించడానికి వీలులేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ప్రభుత్వాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలైంది. స్టేడియం స్థలాన్ని సాంస్కృతిక శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కార్యదర్శి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ […]
Advertisement
రిక్రియేషన్ జోన్ కింద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం స్థలంలో కళాభారతి నిర్మించడానికి వీలులేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ప్రభుత్వాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలైంది. స్టేడియం స్థలాన్ని సాంస్కృతిక శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కార్యదర్శి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Advertisement