సమాచారమిచ్చాకే ఓటు తొలగించాలి: సీఐసీ
ఓటరు జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించే ముందు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ను ఆదేశించింది. ఒకవేళ పేర్లను తొలగించాలన్న ప్రతిపాదన ఏదైనా వస్తే.. ముందుగా ఆ ఓటరుకు సమాచారం ఇవ్వాలని ఆ తరువాతే తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ముందస్తు సమాచారం లేకుండా అమిత్ అనే వ్యక్తి ఓటును జాబితా నుంచి తొలగించినందుకు అతనికి రూ.10వేల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణలోనూ ఫిర్యాదులు వస్తాయా? […]
Advertisement
ఓటరు జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించే ముందు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ను ఆదేశించింది. ఒకవేళ పేర్లను తొలగించాలన్న ప్రతిపాదన ఏదైనా వస్తే.. ముందుగా ఆ ఓటరుకు సమాచారం ఇవ్వాలని ఆ తరువాతే తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ముందస్తు సమాచారం లేకుండా అమిత్ అనే వ్యక్తి ఓటును జాబితా నుంచి తొలగించినందుకు అతనికి రూ.10వేల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.
తెలంగాణలోనూ ఫిర్యాదులు వస్తాయా?
గ్రేటర్ ఎన్నికల్లోగా హైదరాబాద్‌లోని ఓటర్ల జాబితా ప్రక్షాళన చేసి నకిలీల ఏరివేతకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఖ్య వేలల్లో ఉండే అవకాశముంది. అందరికీ సమాచారం ఇచ్చి ఓటర్లు తొలగించమని సీఐసీ ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓట్లు తొలగించిన తరువాత లేదా ముందే సీఐసీని గానీ, ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ప్రక్రియకు విఘాతం కలుగుతుందనే అనుమానాలు చెలరేగుతున్నాయి.
Advertisement