కలాం సాధారణ సైంటిస్ట్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఓ సాధారణ సైంటిస్ట్ అని వ్యాఖ్యానించి పాకిస్థానీగా తన సహజశైలిని ప్రతిబింబించారో శాస్త్రవేత్త. రష్యా సహకారం వల్లనే భారతదేశం అంతరిక్ష పరిశోధనలు, అణు పరిశోధనలు జరిపిందని పాక్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ వ్యాఖ్యానించారు. అబ్దుల్ కలాం మృతికి ప్రపంచమంతా నివాళి అర్పిస్తూ, శోక సంద్రంలో మునిగిపోగా ఖాన్ మాత్రం ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారత్ పట్ల తమకున్న వ్యతిరేకతను చాటుకున్నారు. కలాం గొప్పతనాన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నించారు. రాజకీయ కారణాలతోనే […]
Advertisement
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఓ సాధారణ సైంటిస్ట్ అని వ్యాఖ్యానించి పాకిస్థానీగా తన సహజశైలిని ప్రతిబింబించారో శాస్త్రవేత్త. రష్యా సహకారం వల్లనే భారతదేశం అంతరిక్ష పరిశోధనలు, అణు పరిశోధనలు జరిపిందని పాక్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ వ్యాఖ్యానించారు. అబ్దుల్ కలాం మృతికి ప్రపంచమంతా నివాళి అర్పిస్తూ, శోక సంద్రంలో మునిగిపోగా ఖాన్ మాత్రం ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారత్ పట్ల తమకున్న వ్యతిరేకతను చాటుకున్నారు. కలాం గొప్పతనాన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నించారు. రాజకీయ కారణాలతోనే కలాం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని కూడా ఖాన్ విమర్శించారు. అణు రహస్యాలను ఇతర దేశాలకు అమ్మారన్న అభియోగంపై పాక్ ప్రభుత్వం ఖాన్‌ను చాలాకాలం గృహ నిర్భంధంలో ఉంచడం గమనార్హం.
Advertisement