భారీగా పెరగనున్న కేంద్ర ఉద్యోగుల జీతాలు
ఏడో వేతన సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 40 శాతానికి తగ్గకుండా జీతాలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు నీలకంఠ్ మిశ్రా తెలిపారు. సంఘం తన నివేదికను అక్టోబరులో కేంద్రానికి సమర్పిస్తుంది. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేస్తారని ఆయన తెలిపారు. మూల వేతనంతోపాటు ఏరియర్స్ తదితరాలు కలుపుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయని ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. దీనివల్ల మధ్య […]
Advertisement
ఏడో వేతన సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 40 శాతానికి తగ్గకుండా జీతాలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు నీలకంఠ్ మిశ్రా తెలిపారు. సంఘం తన నివేదికను అక్టోబరులో కేంద్రానికి సమర్పిస్తుంది. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేస్తారని ఆయన తెలిపారు. మూల వేతనంతోపాటు ఏరియర్స్ తదితరాలు కలుపుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయని ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. దీనివల్ల మధ్య తరగతి ఉద్యోగులు స్థిరపడడంతోపాటు స్థిరాస్థి కొనుగోలు వైపు దృష్టి పెడతారని, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశముందని ఆయన అన్నారు.
Advertisement