గుజరాత్‌లో ఓటు వేయకపోతే శిక్షలు!
మీకు ఓటు హక్కు ఉందా … ! ఓటరుగా నమోదు చేసుకున్నారా..! అయితే ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి. లేదంటే మీరు శిక్షలకు పాత్రులు కాక తప్పదు. ఈ నిబంధన పాశ్చాత్య దేశాల్లోనూ, ఇతర ఖండాల్లోనూ అమలవుతున్నవి కాదు సుమా! మనదేశంలోనే. అదీ… ప్రధాని నరేంద్రమోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోనే. ఆ రాష్ట్ర ఓటర్లు ఇకపై తమ ఓటుహక్కును ఖచ్చితంగా వినియోగించుకుని తీరాలి. పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగం తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ […]
Advertisement
మీకు ఓటు హక్కు ఉందా … ! ఓటరుగా నమోదు చేసుకున్నారా..! అయితే ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి. లేదంటే మీరు శిక్షలకు పాత్రులు కాక తప్పదు. ఈ నిబంధన పాశ్చాత్య దేశాల్లోనూ, ఇతర ఖండాల్లోనూ అమలవుతున్నవి కాదు సుమా! మనదేశంలోనే. అదీ… ప్రధాని నరేంద్రమోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోనే. ఆ రాష్ట్ర ఓటర్లు ఇకపై తమ ఓటుహక్కును ఖచ్చితంగా వినియోగించుకుని తీరాలి. పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగం తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుహక్కు వినియోగించని వారికి శిక్షలుంటాయని ప్రకటించిన ప్రభుత్వం శిక్షల వివరాలను మాత్రం ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థలో ఓటుహక్కు వినియోగం తప్పనిసరి చేసే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మొదటిసారి 2009లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగడంతో ఆది మూలన పడిపోయింది. ఆతర్వాత ఆ బిల్లులో పలు సవరణలు చేసి తిరిగి 2014లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును గుజరాత్ గవర్నర్ ఓహ్లీ ఆమోదించారు. దీంతో గుజరాత్ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాదు స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించక పోతే పదవి కోల్పోతారని మరో జీవోను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ సందర్భంగా గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ మాట్లాడుతూ పౌరులకు, ప్రజాప్రతినిధులకు ఓటుహక్కు వినియోగం తప్పనిసరి చేస్తూ తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఓటుహక్కు వినియోగంపై విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది అక్టోబరులో గుజరాత్‌లోని 253 మున్సిపాలిటీలు, 208 తాలూకా పంచాయతీలు, 26 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లోని ఉన్న ఓటర్లందరూ ఓటేసి తీరాల్సిందే. లేకుంటే శిక్షలకు సిద్ధంగా ఉండాల్సిందే!
Advertisement