ఉద్యోగ పత్రాలు ఇస్తేనే అంత్యక్రియలు
పంజాబ్ ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేవరకూ అమరవీరుడు బల్జీత్ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆయన కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని స్పెషల్ పోలీస్ యూనిట్లపై సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చేసిన దాడిలో బల్జీత్‌సింగ్‌తోపాటు ఏడుగురు మృతి చెందారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, రూ. 10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ఉద్యోగ పత్రాలు ఇచ్చేవరకూ తాము దహన […]
Advertisement
పంజాబ్ ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేవరకూ అమరవీరుడు బల్జీత్ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆయన కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని స్పెషల్ పోలీస్ యూనిట్లపై సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చేసిన దాడిలో బల్జీత్‌సింగ్‌తోపాటు ఏడుగురు మృతి చెందారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, రూ. 10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ఉద్యోగ పత్రాలు ఇచ్చేవరకూ తాము దహన సంస్కారాలు చేయమని సింగ్ భార్య అన్నారు. ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిన తన మామ కూడా ఉగ్రవాదుల దాడిలోనే మరణించారని కుటుంబసభ్యులకు ఉద్యోగమిస్తానని ప్రకటించిన ప్రభుత్వం తన హామీని నెరవేర్చుకోవడానికి రెండేళ్లు పట్టిందని ఆమె అన్నారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలు ఇవ్వకుండా ప్రభుత్వం వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆమె విమర్శించారు.
Advertisement