ఆందోళనలో బంగారం తనఖా వ్యాపారులు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరల భారీ పతనం దేశీయ బంగారం తనఖా పెట్టుకునే వ్యాపారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. బంగారం ధరలు దేశంలో భారీగా తగ్గనప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం చూసి ప్రైవేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బంగారాన్ని తనఖా పెట్టుకొని రుణాలు ఇచ్చేందుకు భయపడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు, బ్యాంకులు బంగారంపై ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే గ్రాముకు రూ. 300, రూ.400లు అధికంగా మంజూరు చేశాయి. ప్రస్తుతం ఆ ప్రీమియంను రద్దు చేసి గతంలో బంగారంపై అప్పు […]
Advertisement
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరల భారీ పతనం దేశీయ బంగారం తనఖా పెట్టుకునే వ్యాపారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. బంగారం ధరలు దేశంలో భారీగా తగ్గనప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం చూసి ప్రైవేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బంగారాన్ని తనఖా పెట్టుకొని రుణాలు ఇచ్చేందుకు భయపడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు, బ్యాంకులు బంగారంపై ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే గ్రాముకు రూ. 300, రూ.400లు అధికంగా మంజూరు చేశాయి. ప్రస్తుతం ఆ ప్రీమియంను రద్దు చేసి గతంలో బంగారంపై అప్పు తీసుకున్న వారిని రుణాలు తిరిగి వెంటనే చెల్లించాలని నోటీసులు పంపుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం బంగారు రుణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Advertisement