ఉస్మానియా ఆస్పత్రి రోగుల తరలింపు
శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రి భవనం స్థానంలో ఆధునాతన భవనం నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఆస్పత్రిలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఉస్మానియాలోని 18 యూనిట్లను సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సుల్తాన్ బజార్ ఆస్పత్రిని ఆయన మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్ గ్యాస్ట్రో విభాగాలతోపాటు 400 పడకలున్నాయని ఆయన అన్నారు. 105 సంవత్సరాల తర్వాత […]
Advertisement
శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రి భవనం స్థానంలో ఆధునాతన భవనం నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఆస్పత్రిలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఉస్మానియాలోని 18 యూనిట్లను సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సుల్తాన్ బజార్ ఆస్పత్రిని ఆయన మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్ గ్యాస్ట్రో విభాగాలతోపాటు 400 పడకలున్నాయని ఆయన అన్నారు. 105 సంవత్సరాల తర్వాత ఉస్మానియా ఆస్పత్రిని పునర్నర్మిస్తున్నామని ఆయన చెప్పారు.
Advertisement