కేసీఆర్‌ ఇంటికి ప్రత్యూష: హైకోర్టు ఆదేశం

సవతి తల్లి, తండ్రి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై కోలుకున్న ప్రత్యూషను తెలంగాణ సీఎం నివాసానికి తీసుకెళ్లాలని ఎల్బీనగర్‌ పోలీసులను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే ఆదేశించారు. ప్రత్యూష అంశంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలన్నారు. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ప్రత్యూషను పోలీసులు హైకోర్టులో హాజరుపర్చారు. దాదాపు 25 నిమిషాల పాటు ప్రత్యూషతో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడి అనేక విషయాలను ఆమె నుంచి స్వయంగా తెలుసుకున్నారు. […]

Advertisement
Update:2015-07-29 09:59 IST
సవతి తల్లి, తండ్రి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై కోలుకున్న ప్రత్యూషను తెలంగాణ సీఎం నివాసానికి తీసుకెళ్లాలని ఎల్బీనగర్‌ పోలీసులను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే ఆదేశించారు. ప్రత్యూష అంశంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలన్నారు. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ప్రత్యూషను పోలీసులు హైకోర్టులో హాజరుపర్చారు. దాదాపు 25 నిమిషాల పాటు ప్రత్యూషతో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడి అనేక విషయాలను ఆమె నుంచి స్వయంగా తెలుసుకున్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తన కుటుంబంలో సభ్యురాలిగా ఉండమని ఆహ్వానించారని ప్రత్యూష న్యాయమూర్తికి తెలుపగా ఆయన కేసీఆర్‌ను అభినందిస్తూ ఆమె అభిప్రాయం తెలుసుకున్నారు. తాను కేసీఆర్‌ ఇంటికి వెళతానని చెప్పగా న్యాయమూర్తి సమ్మతిస్తూ ప్రత్యూషను సీఎం నివాసానికి తరలించాలని జస్టిస్ దిలీప్ బి భోసలే ఆదేశించారు. ఆమెను అప్పగించిన తర్వాత కేసీఆర్‌ స్పందన కూడా తమకు తెలియజేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ బోసలే కోరారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యూషను ఛాంబర్‌లో హాజరుపరచాలని, మీడియా సహా ఆమెకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా న్యాయమూర్తులు వినియోగించే లిఫ్ట్‌లో తీసుకురావాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. ఆమెకు కోర్టుకు రావడం ఇబ్బంది లేకపోతే బలవంతం చేయవద్దని కూడా న్యాయమూర్తి ప్రభుత్వానికి తెలిపారు. కాగా, కోర్టు ముందుకు రావడానికి ప్రత్యూష సంసిద్ధత వ్యక్తం చేశారని, ఎలాంటి ఒత్తిడికీ లోనుకావడం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌ శరత్‌కుమార్‌ కోర్టుకు విన్నవించారు. అంతకుముందు సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష గ్లోబల్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రత్యూషను బుధవారం హైకోర్టులో హాజరుపరచాలన్న జస్టిస్ భోసలే ఆదేశం మేరకు ఆమెను హైకోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యూష మీడియాతో మాట్లాడుతూ తనను చిత్రహింసలు పెట్టిన నాన్న, సవతి తల్లిని కఠినంగా శిక్షించాలని జడ్జీని కోరతానన్నారు.
Tags:    
Advertisement

Similar News