ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసే అవార్డులు

ఈ ఏడాది ప్రతిష్టాత్మక రామన్‌ మెగసెసే  అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. మెగాసెసే అవార్డు ఐదుగురికి ప్రకటించగా వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఎయిమ్స్‌ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్‌ చతుర్వేది, గూన్జ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షూ గుప్తా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఎయిమ్స్‌ కుంభకోణాలను సంజీవ్‌ చతుర్వేది బయటపెట్టారు. ఆయన ధైర్యాన్ని మెగాసెసే ఫౌండేషన్‌ మెచ్చుకుంది. సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు చూసి అన్షూ గుప్తాకు అవార్డు ప్రకటించినట్లు మెగాసెసే ఫౌండేషన్‌ తెలిపింది. పేదల అభ్యున్నతి కోసం […]

Advertisement
Update:2015-07-28 18:46 IST
ఈ ఏడాది ప్రతిష్టాత్మక రామన్‌ మెగసెసే అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. మెగాసెసే అవార్డు ఐదుగురికి ప్రకటించగా వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఎయిమ్స్‌ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్‌ చతుర్వేది, గూన్జ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షూ గుప్తా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఎయిమ్స్‌ కుంభకోణాలను సంజీవ్‌ చతుర్వేది బయటపెట్టారు. ఆయన ధైర్యాన్ని మెగాసెసే ఫౌండేషన్‌ మెచ్చుకుంది. సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు చూసి అన్షూ గుప్తాకు అవార్డు ప్రకటించినట్లు మెగాసెసే ఫౌండేషన్‌ తెలిపింది. పేదల అభ్యున్నతి కోసం అన్షూ గుప్తా కృషి చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News