తెలంగాణలో ఆస్పత్రులకు మహర్దశ!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లోని హాస్పిటల్స్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.5,500 కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు రూపొదించింది. ప్రస్తుతం ఉన్న బోధనా దవాఖానలన్నింటినీ అప్‌గ్రేడ్ చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 4,750 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రూ.1,908 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ దవాఖానలను అప్‌గ్రేడ్ చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే […]

Advertisement
Update:2015-07-29 00:33 IST
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లోని హాస్పిటల్స్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.5,500 కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు రూపొదించింది. ప్రస్తుతం ఉన్న బోధనా దవాఖానలన్నింటినీ అప్‌గ్రేడ్ చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 4,750 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రూ.1,908 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ దవాఖానలను అప్‌గ్రేడ్ చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే వాగ్దానం చేసింది. ఆ హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. దవాఖానల్లో ప్రధానంగా అటెండర్‌ స్థాయి నుంచి డాక్టర్ పోస్టుల వరకు ఖాళీలను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్యవిధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని పీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనా ఆస్పత్రుల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎంత మందిని నియమించుకోవచ్చు? అనే అంశాలపై గతంలోనే అధికారులను ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది.
దీంతోపాటు తాజాగా భవనాల నిర్మాణం, బెడ్ల సంఖ్యను పెంచితే కావాల్సి మౌలిక సదుపాయాలపై కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించింది. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం లాంటి బోధనా దవాఖాలను 1,000 నుంచి 2,000 పడకలకు అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం కోరింది. ఆదిలాబాద్‌లోని రిమ్స్, నిజామాబాద్ టీచింగ్ దవాఖాన, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలను కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇక జిల్లా దవాఖానలను 500 బెడ్ల నుంచి వెయ్యి బెడ్లకు పెంచనున్నారు. మెడికల్ కాలేజీలు లేని మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లా దవాఖానలను మెడికల్ కాలేజీలుగా మారిస్తే ప్రతి జిల్లాలో 1,000 పడకల వరకు అందుబాటులోకి వస్తాయి. ఇందుకు రూ.1,040 కోట్లు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. ఏరియా దవాఖానల్లో 50 బెడ్ల సామర్థ్యం ఉన్నవాటిని 100 బెడ్లకు పెంచబోతున్నారు. దీనివల్ల మూడు వేల పడకలు పెరిగే అవకాశం ఉంది. 400పైగా ఉన్న పీహెచ్‌సీల్లో 248 పీహెచ్‌సీలను ఆరు బెడ్ల సామర్థ్యం ఉన్న దవాఖానలను 30 బెడ్లకు పెంచబోతున్నారు. దీనిద్వారా ఆరు వేల బెడ్లు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
జిల్లాల్లోని దవాఖానలను నిమ్స్ స్థాయికి పెంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి అధికారులతో ఇప్పటికే రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. దవాఖాలవారీగా భవనాల నిర్మాణానికి ఆర్థిక అంచనాలు ఇవ్వాలని ఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఈడీ లక్ష్మారెడ్డిని ఆదేశించారు. అలాగే ఖాళీల భర్తీ, అదనంగా తీసుకోవాల్సిన సిబ్బందిపై ప్రతిపాదనలు ఇవ్వాలని డీఎంఈ, డీహెచ్, ఏపీవీవీపీ కమిషనర్లకు సూచించారు. పూర్తి ప్రతిపాదనలు రాగానే సీఎం వద్ద మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోరి 55 ఏరియా దవాఖానలను 100 పడకల స్థాయికి పెంచేందుకు రూ.949.50 కోట్లు అవసరమని అంచనా వేశారు. 248 పీహెచ్‌సీల అప్‌గ్రేడేషన్‌కు రూ.1612కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.
Tags:    
Advertisement

Similar News