స్కూళ్లలోనూ బ‌యో మెట్రిక్ విధానం

అయ్య‌వారొచ్చినప్పుడే బడి… బ‌స్సు ఎప్పుడు వ‌స్తే అయ్య‌వార‌ప్పుడు వ‌స్తారు. మారుమూల గ్రామాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌, క‌ళాశాల‌ల ప‌రిస్థితి ఇది. అయితే, తెలంగాణ ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల అల‌స‌త్వానికి ముకుతాడు వేయాల‌ని భావిస్తోంది. టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లు వేళ‌కు విధులు హాజ‌ర‌య్యేలా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ, క‌ళాశాల‌ల్లోనూ బ‌యో మెట్రిక్ విధానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించింది. బ‌యో మెట్రిక్ విధానం వ‌ల్ల అధ్యాప‌కులు హాజ‌ర‌య్యే వేళ‌లు న‌మోద‌వుతాయి. దీంతో ప్ర‌భుత్వం వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుంటుంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయులు ఎక్కువ […]

Advertisement
Update:2015-07-28 18:35 IST
అయ్య‌వారొచ్చినప్పుడే బడి… బ‌స్సు ఎప్పుడు వ‌స్తే అయ్య‌వార‌ప్పుడు వ‌స్తారు. మారుమూల గ్రామాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌, క‌ళాశాల‌ల ప‌రిస్థితి ఇది. అయితే, తెలంగాణ ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల అల‌స‌త్వానికి ముకుతాడు వేయాల‌ని భావిస్తోంది. టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లు వేళ‌కు విధులు హాజ‌ర‌య్యేలా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ, క‌ళాశాల‌ల్లోనూ బ‌యో మెట్రిక్ విధానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించింది. బ‌యో మెట్రిక్ విధానం వ‌ల్ల అధ్యాప‌కులు హాజ‌ర‌య్యే వేళ‌లు న‌మోద‌వుతాయి. దీంతో ప్ర‌భుత్వం వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుంటుంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయులు ఎక్కువ మంది ప‌ని చేసే గ్రామాల్లో నివ‌సించ‌కుండా సిటీల్లోను, సమీప పట్టణాల్లోను కాపురం ఉంటున్నారు. ఈ ప్ర‌భావం విద్యార్ధుల‌పై ప‌డుతోంది. తెలంగాణ‌లో ప్ర‌తి ఏటా ప‌ది శాతం మంది ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల‌కు దూర‌మ‌వుతున్నారు. ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని, ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల‌కు పూర్వ వైభ‌వం క‌ల్పించాల‌ని టీ.స‌ర్కార్ నిర్ణ‌యించింది. అందుకు ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో బ‌యో మెట్రిక్ విధాన‌మే స‌రైన ప‌రిష్కార‌మ‌ని భావిస్తోంది.
Tags:    
Advertisement

Similar News