ప్ర‌త్యేక హోదాపై హ‌స్తిన‌లో ధ‌ర్నా చేస్తా : జ‌గ‌న్‌

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌రుస దీక్ష‌లు, ఉద్య‌మాల‌తో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదాపై దృష్టిపెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విష యంలో కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో ధర్నా చేపడుతామని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిశాన‌ని, మంగళగిరిలో ఇదే అంశంపై రెండు రోజుల దీక్ష కూడా చేశాన‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. […]

Advertisement
Update:2015-07-28 02:01 IST
ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌రుస దీక్ష‌లు, ఉద్య‌మాల‌తో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదాపై దృష్టిపెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విష యంలో కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో ధర్నా చేపడుతామని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిశాన‌ని, మంగళగిరిలో ఇదే అంశంపై రెండు రోజుల దీక్ష కూడా చేశాన‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా లో ఏడు రోజులుగా సాగుతున్న రైతు భరో సా యాత్ర సోమవారం ముగిసింది. మండ లంలోని అలుపనపల్లి, ఉజ్జనీపురంలలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులు రామిరెడ్డి, నల్లప్ప కుటుంబాలన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రోళ్ల బస్టాండు వద్ద నిర్వహిం చిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం దిగిరాకపోతే 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీల తో ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. కేంద్రం, చంద్రబాబుకు కళ్లు తెరిపించేలా ఉద్యమం చేస్తామన్నారు. రాహుల్‌ గాంధీ ఏనాడూ ప్రతిపక్ష పాత్ర పోషించలేదన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించేది వైఎ స్‌ఆర్‌ సిపినేనన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులు డ్వాక్రా మహిళలను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ నిర్మూలన పేరుతో యువతను మోసం చేశారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పబ్లిసిటీ వచ్చే చోట మాత్రమే చంద్రబాబు పరిహారం ఇస్తున్నా రని ఆరోపించారు. ఏ రైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా పార్టీలతో సంబంధం లేకుండా రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
Tags:    
Advertisement

Similar News