రణరంగమైన కొమరం భీం కాలనీ
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహిపట్నం మండలంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న గుడిసె వాసులపై రెవెన్యూ అధికారులు జులుం ప్రదర్శించారు. లాఠీలు… కర్రలతో పోలీసులు విరుచుకు పడ్డారు. దీనితో అక్కడ నివాసం ఉంటున్న కొందరు తలలు పగిలాయి. ఈ ఘటన మంగళ్ పల్లి రెవెన్యూ పరిధిలోని కొమరం భీం కాలనీలో చోటు చేసుకుంది. సుమారు మూడు వేల మంది కొమరం భీం కాలనీలో పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరిని అక్కడ నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు మంగళవారం […]
Advertisement
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహిపట్నం మండలంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న గుడిసె వాసులపై రెవెన్యూ అధికారులు జులుం ప్రదర్శించారు. లాఠీలు… కర్రలతో పోలీసులు విరుచుకు పడ్డారు. దీనితో అక్కడ నివాసం ఉంటున్న కొందరు తలలు పగిలాయి. ఈ ఘటన మంగళ్ పల్లి రెవెన్యూ పరిధిలోని కొమరం భీం కాలనీలో చోటు చేసుకుంది. సుమారు మూడు వేల మంది కొమరం భీం కాలనీలో పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరిని అక్కడ నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు మంగళవారం తెల్లవారుజామున పోలీసులతో రెవెన్యూ అధికారులు కొమరం భీం కాలనీ ప్రాంతానికి వచ్చారు. ఖాళీ చేసి వెళ్లేందుకు గుడిసె వాసులు ససేమిరా అనడంతో పోలీసులు తమ ప్రతాపాన్ని చూపెట్టారు. లాఠీలు… కర్రలతో చావ బాదారు. పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేసేందుకు యత్నించారు. నివాసం ఉంటున్న వారు అడ్డుపడడంతో గుడిసెలకు రెవెన్యూ సిబ్బంది నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు ఆగ్రహంతో సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. వీరి ఆవేశానికి రెండు పోలీసు వాహనాలు, డీసీఎం వాహనాలు తగులబడిపోయాయి. దీంతో అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు. మహిళలు… వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా వ్యవహరించారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Advertisement