ప్రభుత్వ ఉద్యోగాలకు వయస్సు పదేళ్లు సడలింపు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర నియామక ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితి పదేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగార్హత గరిష్ఠ వయస్సు 44కు చేరనుంది. అడహాక్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ బీసీలకు అదనంగా మరో ఐదు సంత్సరాలు మినహాయింపు లభించనుంది. దీని ప్రకారం జనరల్ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు […]
Advertisement
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర నియామక ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితి పదేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగార్హత గరిష్ఠ వయస్సు 44కు చేరనుంది. అడహాక్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ బీసీలకు అదనంగా మరో ఐదు సంత్సరాలు మినహాయింపు లభించనుంది. దీని ప్రకారం జనరల్ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 సంవత్సరాల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పోటీ పడవచ్చు.
Advertisement